నాకు దక్కనిది మరొకరికి దక్కనివ్వను.. ఇది సినిమా డైలాగే అయినా నిజజీవితంలో దీనిని అచ్చుగుద్దినట్టుగా దించేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిసూ రెచ్చిపోతున్నారు. ప్రేమించాలని వెంటపడడం, కాదంటే హత్యలు, అత్యాచారాలు వంటి దాడులకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరులోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో అహ్మద్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో అతనికి తను పని చేసే చోట భర్తతో విడాకులు తీసుకున్న ఇద్దరు పిల్లల తల్లితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఇద్దరు కాస్త చనువుగా ఉండేవారు. ఇదే చనువుతో అహ్మద్ మహిళను శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడు. ఇక ఇంతటితో ఆగకుండా.. నన్ను పెళ్లి చేసుకోవాలంటూ కూడా విసిగించేవాడు. మనోడి పిచ్చి చేష్టలను పట్టించుకోకుండా ఆ మహిళ కాస్త పక్కకు నెట్టి అతనితో పెళ్లికి నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Nirmal: పెళ్లి అయిన 2 నెలలకే దారుణం! భర్త ఆఫీస్ నుండి రాగానే..!అలా కొంత కాలం అహ్మద్ ఆ మహిళను వేధిస్తునే ఉండేవాడు. అయినా అహ్మద్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆ మహిళ అతనిని చీకొట్టినట్లుగా ప్రవర్తించడంతో మనోడికి కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఇటీవల మరోసారి పెళ్లి చేసుకోవాలంటూ అడిగాడు. దీనికి ఆమె మళ్లీ నిరాకరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన అహ్మద్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆ మహిళ మొహం పోశాడు.
దీంతో తీవ్రగాయాలపాలైన మహిళను గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అదుపులోకి విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.