నేటి కాలంలో కొందరు భర్తలు నమ్మివచ్చిన భార్యలను కాదని ఎంచక్కా పరాయి మహిళలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తూ చివరికి ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన తాజాగా బెంగుళూరులో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీరంగపట్టణ పరిధిలోని గుండెహోసహళ్లిలో యోగిత, రవిగౌడ ఇద్దరు భార్యాభర్తలు.
వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే భర్త రవిగౌడ భార్యతో కొన్నాళ్ల పాటు సంసారం బాగానే చేశాడు. కానీ కొంత కాలం తర్వాత బుద్ది వక్రమార్గంలోకి నెట్టేసి పరాయి మహిళలపై కన్నేశాడు. ఈ వ్యవహారం భార్య యోగితకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. దీంతో కొన్ని రోజుల తర్వాత భర్త చీకటి యవ్వారం భార్యకు తెలిసింది. ఇదే విషయమై భార్య భర్తను అనేక సార్లు నిలదీసింది.
ఇది కూడా చదవండి: kamareddy: భర్తను చంపి కొత్తింట్లో పాతిపెట్టిన భార్య.. ఒళ్లు గగుర్పొడిచే నిజాలు ఏంటంటే?
ఇక సమాధానం చెప్పలేక నోట్లో నీళ్లు నమిలిన భర్త తాజాగా క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. భర్త సాగిస్తున్న చీకటి కాపురాన్ని ప్రశ్నించిన భార్యను రవిగౌడ పిల్లలు చూస్తుండగానే ఇంట్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. తల్లిని హత్య చేస్తుంటే చూసిన పిల్లలు చలించిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.