సాఫీగా సాగుతున్న భార్యాభర్తల వైవాహిక జీవితాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ నిండు కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత భర్తను కాదని సొంత మామతో చీకటి కాపురాన్ని నడిపింది. ఈ బెంగుళూరులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తికి మూడేళ్ల కిందట వివాహమైంది. భార్యతో పాటు అతని తండ్రి కూడా వాళ్లతో పాటే నివాసం ఉంటున్నాడు. ఇక కొన్ని రోజుల తర్వాత భర్త ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి భార్య అతని తండ్రి ఒకే ఇంట్లో ఉండేవారు. ఇక కొన్నాళ్ల నుంచి భర్త లేకుండా ఒంటరిగా ఉంటున్న భార్య సొంత మామపై కన్నేసింది. దీనికి మామ కూడా సై అనడంతో ఇద్దరు కలిసి ఏకంతంగా గడిపారు.
ఇది కూడా చదవండి: Eluru: భర్తను కాదని మరిదితో వదిన.. తీరా భర్తకు తెలియడంతో!
సమయమొచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ కోరికలు తీర్చుకుంటున్నారు. అయితే ఇటీవల దుబాయి నుంచి ఇంటికొచ్చిన భర్తకు భార్య సాగిస్తున్న చీకటి కాపురం బయటపడింది. దీంతో అతని కోపం కట్టలు తెంచుకుంది. కోపంతో ఊగిపోయి తండ్రిని, భార్యను దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.