వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కలకాలం పాటు సంతోషంగా చూసుకుంటానని వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేశాడు. ఇక కోరుకున్న వాడితోనే తాళి కట్టించుకున్న ప్రియురాలు కూడా ఎన్నో కలలు కనింది. కానీ పెళ్లైన కొన్నాళ్లకి భర్త అసలు రంగు బయటపడి భార్యకు బతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాడు. గత ఐదు నెలలుగా భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ ఉన్మాదిలా వ్యవహరించడంతో భార్య తట్టుకోలేకపోయింది.
భర్త దారుణాన్ని తట్టుకోలేకపోయిన భార్య వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని మల్లేశ్వరం. ఇక్కడే నివాసం ఉంటున్న ప్రదీప్ అనే యువకుడు ఐదేళ్ల కిందట ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం పాటు ప్రదీప్ భార్యతో బాగానే కాపురం చేశాడు.
ఇది కూడా చదవండి: ఆమె ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. దానికి ఒప్పుకోకపోవడంతో!
కానీ రోజులు మారుతున్న కొద్ది భర్త అసలు రంగు బయటపడింది. గత ఐదు నెలలకు భార్యకు అశ్లీల వీడియోలు చూపించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఇక ఇంతటితో ఆగకుండా రాత్రిపూట సిగరెట్ తో భార్య ప్రైవేట్ పార్ట్ లో వాతలు పెట్టి రాక్షస ఆనందాన్ని పొందేవాడు. ఇంతటితోనే కాకుండా తన స్నేహితులను ఇంటికి రప్పించుకుని వారి ముందే భార్యను అవమానపరిచేలా ప్రవర్తించేవాడు.
ఇక భర్త ప్రవర్తనతో విసుగుచెందిన భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బతికుండగానే భార్యకు నరకం చూపించిన భర్త తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.