బెంగుళూరులో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి నమ్మించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు రాక్షస ప్రేమతో భార్యతో సంసారం చేశాడు. అలా కొన్ని రోజులు గడిచింది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది అతడి అసలు రూపం బయటపడుతూ వచ్చింది. భార్యపై అనుమానంతో అతడు తరుచు వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఇటీవల భార్యతో మరోసారి గొడవపడ్డాడు. క్షణికావేశంలో కోపంతో ఊగిపోయి భర్త భార్యను హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా విమానంలో ఢిల్లీకి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు నిందితుడి పూర్తి వివరాలు తెలిసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఇతడి పేరు నాసిర్ హుసెన్. సిలిగిరి ద్వారా కోల్ కత్తా వచ్చి అక్కడ నకిలీ పత్రాలతో ఆధార్ కార్డు సంపాదించాడు. ఆ తర్వాత ఎలాంటి డిగ్రీ, కంప్యూటర్ హార్డ్ వేర్ లో శిక్షణా పత్రాలు లేకుండా ఏకంగా బెంగుళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. అలా కొంత కాలం పాటు అక్కడే పని చేస్తూ డబ్బు బాగానే కూడబెట్టాడు. అయితే ఇతడు ఉద్యోగం చేస్తూ సుద్దగుంటపాళ్యలో నివాసం ఉండేవాడు. ఇదిలా ఉంటే ఇతనికి ఇన్నేళ్ల కాలంలో నాజ్ అనే అమ్మాయి పరిచయం అయింది. దీంతో వారి కుటుంబ సభ్యులను నమ్మించి, ఎన్నో మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు.
పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే గత కొంత కాలం నుంచి భర్త నాసిర్ హుసెన్ భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. ఇదే విషయంపై తరచు భార్యతో గొడవ పడేవాడు. అలా రోజు రోజుకు అతడు సైకోలా మారిపోయాడు. ఇదిలా ఉంటే ఇటీవల హుసెన్ భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. క్షణికావేశంలో ఊగిపోయిన అతడు.. భార్య నాజ్ ను గొంతుపిసికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా విమానంలో ఢిల్లీకి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న నాజ్ తల్లిదండ్రులు హుటాహటిన కూతురు ఇంటికి చేరుకున్నారు.
చనిపోయి ఉన్న కూతురిని చూసి ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై నాజ్ కుటుంబ సభ్యులు భర్త నాసిర్ హుసెన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోగా.. అతడిది ఇండియా కాదని, బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి అక్రమంగా వలస వచ్చాడని తెలుసుకున్నారు. నిందితుడి గురించి అసలు నిజాలు తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.