భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఇంత దానికే కొందరు దంపతులు గొడవలు పడి చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో రోజుకొక చోెట వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే నేపాలీకి చెందిన ఓ మహిళ భర్తతో గొడవ పడి కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. కట్ చేస్తే 6 నెలల తర్వాత ఆ మహిళ గురించి ఓ నమ్మలేని నిజం ఆమె భర్తకు తెలిసింది. ఈ క్రైమ్ స్టోరీలో మిస్టరీ ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక అక్షయ నగర్ లో నేపాల్ కు చెందిన భార్య పుష్పదామి, భర్త అమర్ దామి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. అయితే రాను రాను భర్త తాగుడుకు బానిసై తరుచు భార్యతో గొడవపడేవాడు. ఇకపోతే గత 6 నెలల కిందట భర్త అమర్ దామి అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంతటితో ఆగని అమర్ దామి.. మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. ఇక ఇతడితో ఉండడం దండక అన్నుకున్న భార్య.. భర్తపై కోపంతో గతేడాది జూలై 8న ఇళ్లు వదిలి వెళ్లింది.
అయితే సాయంత్రం అయినా భార్య పుష్పదామి ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పుష్పదామి ఆచూకి కోసం చాలా చోట్ల గాలించారు. కట్ చేస్తే 6 నెలల తర్వాత హుళిమావు పరిధిలోని ఓ ప్రాంతంలో చెట్ల పొదల్లో చెట్టుకు ఉరి వేసుకుని మనిషి పుర్రె లభ్యమైంది. దీంతో స్థానికులు దీనిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ అస్థిపంజరాలు ఎవరివో కావు.. గత 6 నెలల నుంచి కనిపించకుండా పోయిన అమర్ దామి భార్య పుష్పదామిగా పోలీసులు గుర్తించారు. భర్తపై కోపంతోనే పుష్పదామి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.