ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో అనేక దారుణాలు జరుగుతున్నాయి. ప్రేమించాలని వెంటపడడం, కాదంటే అత్యాచారాలు, ఆపై హత్యలు. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. ఇదిలా ఉంటే ఓ డాక్టర్ ను ప్రేమించాలంటూ గత కొన్ని రోజుల నుంచి సహోద్యోగి టార్చర్ పెడుతున్నాడు. ఇక ఇంతటితో ఆగకుండా చివరికి అలా కూడా చేయాలన్నాడు. దీనిని భరించలేని ఆ యువతి ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
లక్నోకు చెందిన ఈ యువతి గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని ఓ ప్రముఖ దంత ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తుంది. అయితే ఇక్కడే పని చేస్తున్న క్రమంలోనే ఆమెకు సుమిత్ అనే సహోద్యోగి పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతో సుమిత్ తరుచు ఆ యువతితో మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. అలా సుమిత్ కొన్ని రోజుల పాటు ఆమెతో కాస్త చనువుగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే రాను రాను సుమత్ ప్రవర్తనలో అనూహ్యంగా మార్పులొచ్చాయి. ఇక ఆ యువతిపై కన్నేసిన సుమిత్… ఎలాగైన లోబరుచుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే నువ్వంటే ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేనని.. ఆమెతో ప్రేమించాలంటూ వెంటపడ్డాడు.
ఇక ఇంతటితో ఆగకుండా మద్యం తాగాలని, సిగరెట్ కూడా తాగాలని టార్చర్ చేసేవాడు. అయినా అతగాడి చేష్టలకు ఆ యువతి ఏ మాత్రం మెట్టుదిగలేదు. ఇక విసిగిపోయిన సుమిత్.. తన రూట్ ను పూర్తిగా మార్చేశాడు. ఏకంగా ఆ యువతి గురించి ఆస్పత్రిలో చెడుగా ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఆస్పత్రి వర్గాలు ఆ యువతి గురించి చెడుగా ఊహించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఇక ఏం చేయాలో అర్థంకాని ఆ యువతి.. ఈ నెల 25న ఆత్మహత్య చేసుకుంది.
దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.