వారిద్దరూ భార్యాభర్తలు. మతాలు వేరైనా గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు బాగానే సంసారం చేశారు. అలా రోజులు గడుస్తున్న క్రమంలోనే భార్య తన అసలు రూపాన్ని బయటపెట్టింది. రోజూ రాత్రిపూట బెడ్ రూంలో భార్య భర్తకు ఆ విషయంలో టార్చర్ పెట్టేది. కొన్నాళ్లు భరించిన భర్త.. ఇక తట్టుకోలేకపోయాడు. దీంతో నా వల్ల కాదని భావించిన భర్త చివరికి కోర్టును ఆశ్రయించి తన బాధను వివరించారు. బాధితుడి కేసును విచారించిన న్యాయస్థానం బాధితుడి భార్యకు ఊహించని షాక్ ఇచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అది బెంగుళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ లోని అశోక్ పురం. ఇక్కడే దీపక్, సునీతా గ్రేసి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. గతంలో వీరిద్దరికి పరిచయం ఉండడంతో ప్రేమించుకున్నారు. ఇక 2019 జనవరి 19న ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. భర్త స్థానికంగా వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా రోజులు గడుస్తున్న క్రమంలోనే భార్య సునీతా గ్రేసి తన అసలు రూపాన్నిబయటపెట్టింది. భర్త కష్టపడి సంపాదించిన డబ్బులను ఇంటి అద్దెకు, అవసరాలకు డబ్బులు ఇస్తుండేవాడు. భార్య మాత్రం ఆ డబ్బులతో జల్సాలు చేస్తూ వచ్చేది.
కొన్ని రోజుల తర్వాత భర్త భార్యను ఇదే విషయంపై నిలదీయగా.. నువ్వు మతం మార్చుకో.. అప్పుడు నేను నువ్వు చెప్పినట్టుగా వింటానని తెలిపింది. భర్త భార్యకు బదులిస్తూ.. చచ్చినా ఆ మతంలో చేరనని కరఖండిగా చెప్పాడు. అయినా వినని భార్య రాత్రిపూట బెడ్ రూంలో ఇదే విషయంపై భర్తను టార్చర్ పెడుతు ఉండేది. ఇక ఇంతటితో ఆగకుండా నువ్వు మతం మార్చుకోకుంటే.. నీపై వరకట్నం వేధింపుల కేసు పెడతానని బ్లాక్ మెయిల్ కు దిగేది. ఇక భార్య టార్చర్ తో విసుగిపోయిన భర్త ఇటీవల కోర్టు మెట్లెక్కాడు. బాధితుడి కేసుపై స్పందించిన న్యాయస్థానం.. ఇలా బలవంతంగా మతమార్పిడి చేయడం నేరమని, నిందితురాలిపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెపై విచారణ చేపడుతున్నారు.