ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. కొన్నికారణాల వల్ల భర్తకు విడాకులు ఇచ్చి మరొక వ్యక్తితో సహజీవనం చేసింది. అలా చాలా కాలం పాటు ఇద్దరూ బాగానే కలిసి ఉన్నారు. కానీ, ఇదే చివరికి ఆ మహిళను ప్రాణాలతో లేకుండా చేసింది. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు మంజుల, వయసు 32 ఏళ్లు. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా రాను రాను ఈ భార్యాభర్తల మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఈ దంపతులు పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ మహిళ ఒంటరిగా జీవిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే మంజులకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతోనే ఆ మహిళ అతడితో సహజీవనం చేస్తూ వచ్చింది. కానీ, ఆ ఒక్క పొరపాటే చివరికి ఆమెను ప్రాణాలతో లేకుండా చేసింది. అసలేం జరిగిందంటే?
బెంగుళూరు లక్ట్రానిక్ సిటీ సమీపంలోని సంపి నగర్ ప్రాంతం. ఇక్కడే మంజుల (32) అనే మహిళ నివాసం ఉండేది. అయితే ఆమెకు గతంలో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. దీంతో చాలా కాలం పాటు ఈ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటూ సంసారాన్ని నెట్టుకొచ్చారు. కానీ, కొన్ని రోజుల తర్వాత ఈ దంపతుల మధ్య సఖ్యత లేకుండా పోయింది. తరుచూ గొడవ పడుతూ ఉండేవారు. ఇలా అయితే కాదని భావించిన మంజుల.. భర్తకు విడాకులు ఇచ్చి అతని నుంచి దూరం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆ మహిళ స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనికి కుదరింది.
ఈ క్రమంలోనే ఆమెకు నారాయణ్ (42) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే ఇద్దరిని కాస్త దగ్గరకు చేర్చింది. దీంతో ఇద్దరూ సహజీవనం చేయడం మొదలు పెట్టారు. అలా చాలా కాలం పాటు ఇద్దరూ సహజీవనం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నారాయణ్ మంజులపై అనుమానంతో వేధించడం మొదలు పెట్టాడు. నీకు పరాయి మగాళ్లతో సంబంధం ఉందని, నువ్వు ఆ కంపెనీలో పనికి వెళ్లకూడదని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ, మంజుల మాత్రం నేను ఆ కంపెనీలో ఉద్యోగం మానేయను అంటూ ఖరాఖండిగా చెప్పింది. ఇదే నారాయణ్ కు కోపాన్ని తెప్పించింది. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన ఆ వ్యక్తి.. మార్చి 29 మంజులను దారుణంగా హత్య చేశాడు.
ఆ తర్వాత ఆమె శరీర భాగాలను ఓ చోట కాల్చి వేశాడు. ఉన్నట్టుండి మంజుల కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా నారాయణ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. నేనే మంజులను హత్య చేశానని అంగీకరించాడు. అనంతరం నిందితుడు చెప్పిన వివరాలు ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. మంజుల ఎముకలు, పుర్రె మాత్రమే కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.