ఓ కొడుకు కన్న తండ్రిని సిమెంట్ ఇటుకతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఏకంగా 15 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నాడు. అసలు తండ్రిని కుమారుడు ఎందుకు హత్య చేశాడో తెలుసా?
సమాజంలో కొందరు వ్యక్తులు మనుషుల్లా కాకుండా మృగాల్లా వ్యవహరిస్తున్నారు. కనిపించిన ఆడ పిల్లలను అత్యాచారం చేయడం, కాదంటే హత్యలు చేస్తున్నారు. నేటి కాలంలో ఎక్కువగా జరుగుతున్న దారుణాలు ఇవే. మరి కొందరైతే క్షణికావేశంలో కన్నవాళ్లను కూడా కాటికి పంపిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. క్షణికావేశంలో ఓ యువకుడు కన్న తండ్రిని దారుణంగా కొట్టి చంపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు కొడుకు తండ్రిని ఎందుకు చంపాడో తెలిస్తే మీరు నోరెళ్ల బెట్టడం ఖాయం.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరులోని గోవిందరాజు నగర్ లో తండ్రి బసవరాజు (60), కొడుకు నీల్ ధర్ నివాసం ఉంటున్నారు. తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుండగా, కుమారుడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అలా తండ్రీ కొడుకులు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కానీ, కుమారుడు నీల్ ధర్ మాత్రం మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం సేవిస్తూ గొడవ తండ్రితో గొడవకు దిగేవాడు. అయితే గత 15 రోజుల కిందట మద్యానికి డబ్బులు ఇవ్వాలని కుమారుడు తండ్రి బసవ రాజుని అడిగాడు. దీనికి అతడు నిరాకరిస్తూ లేవంటూ తేల్చి చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన కుమారుడు తండ్రితో గొడవ పడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పట్టరాని కోపంతో ఊగిపోయిన నీల్ ధర్.. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న సిమెంట్ ఇటుకతో తండ్రి తలపై బలంగా బాదాడు.
ఈ దాడిలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా తండ్రి శవాన్ని ఏకంగా 15 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నాడు. అయితే ఇటీవల వీళ్లుంటున్న ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది. ఎందుకో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి ఇంటిని పరిశీలించగా.. కుల్లిన స్థితిలో ఉన్న శవం బయటపడింది. దీనిని చూసి పోలీసులు షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో మాత్రం అతని కుమారుడు నీల్ ధర్ తండ్రిని కొట్టి చంపాడని తేలింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కొట్టి చంపిన కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.