వాళ్లిద్దరూ భార్యాభర్తలు. భార్య టీచర్ గా విధులు నిర్వర్తిస్తుండగా, భర్త మాత్రం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అలా వీరి సంసారం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే వీరి కాపురం ఒక్కసారిగా కుప్పకూలింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పైన ఫోటోలో కనిస్తున్న ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి గత 10 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఈ దంపతులు ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి హోదాల్లో స్థిరపడ్డారు. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుండగా.., భార్య మాత్రం టీచర్ గా విధులు నిర్వర్తించారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు. దీంతో వీరి జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే వీరి స్టోరీ ఊహించని మలుపుకు తిరిగింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
బెంగుళూరు సుబ్రహ్మణ్యపూర్ లో రష్మీ (30), అరవింద్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 10 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుండగా.., భార్య టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలా వీరి జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. కట్ చేస్తే.. కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ కుమారుడు(5) జన్మించాడు. పుట్టిన కుమారుడిని చూసుకుంటూ ఈ భార్యాభర్తలు ఆనందంగా జీవించేవారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం రాత్రి 8:30 నిమిషాలకు దంపతులు ఇద్దరూ ఏదో విషయమై గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
అదే రోజు రాత్రి భార్య బెడ్ రూం తలుపులు వేసుకుని ఒంటరిగా పడుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం 9 దాటినా భార్య రష్మీ తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన భర్త.. భార్యను పిలుస్తూ తలుపులు తీసే ప్రయత్నం చేశాడు. కానీ, ఎంత ప్రయత్నించినా రష్మీ తలుపులు తీయలేదు. భర్త తలుపులు బద్దలు కొట్టి చూడగా.. భార్య రష్మీ బెడ్ రూంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సీన్ చూసిన భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇరుగు పొరుగు వారు అంతా వచ్చి చూసి ఖంగుతిన్నారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రష్మీ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కూతురుని అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని రష్మీ తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ విషాధ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.