లేడీ టైలర్స్‌గా వేషం మార్చి ఆ ముసుగులో వ్యభిచారం నిర్వహించారు ఇద్దరు కిలేడీలు. పాపం అభంశుభం తెలియని ఓ బాలికను వ్యభిచార కూపంలోకి లాగాలనుకున్నారు. మత్తు మందుతో స్ప్రహ కోల్పోయేలా చేసి 6 రోజుల పాటు విటులతో వ్యభిచారం చేయించారు. తల్లి సహాయంతో సదరు బాలిక పోలీసులను ఆశ్రయించటంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు, బందెపాళ్యకు చెందిన 16 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలో నివాసం ఉండే రాజేశ్వరి దగ్గర టైలరింగ్ నేర్చుకుంటోంది. తరచుగా వారి ఇంటికి వెళ్లి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన బాలిక తల్లి ఇంటినుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత రాజేశ్వరి ఇంటి వద్దకు వచ్చింది.
బాలిక తల్లి తన ఇంటి వద్ద వేచి చూస్తోందని, అక్కడికి బాలికను తీసుకురమ్మందని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన బాలిక వెంట వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత తాగటానికి జ్యూస్ ఇచ్చింది. అది తాగిన తర్వాత బాలిక స్ప్రహ కోల్పోయింది. స్ప్రహ కోల్పోయిన తర్వాత కేశవ మూర్తి అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. స్ప్రహ వచ్చిన తర్వాత బాలిక తనపై జరిగిన అన్యాయాన్ని గుర్తించింది. అయితే, జరిగిన దాన్ని బయటకు చెబితే దారుణ పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని రాజేశ్వరి హెచ్చరించింది. తర్వాత బాలికను కళావతి ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మరి కొంతమంది ఆమెపై అత్యాచారం చేశారు.
అలా 6 రోజులు గడిచాయి. తాము పిలిచినపుడల్లా వస్తుండాలని ఇద్దరు బాలికను బెదిరించారు. మార్చి 6వ తేదీన కూడా బాలికను ఇంటికి రావాలన్నారు. ఆ రోజు బాలిక తల్లి ఇంట్లో ఉంది. కూతురు ఎందుకో బాధపడుతోందని గ్రహించి అడిగింది. సమాధానం రాలేదు. బాలిక దస్తులపై రక్తపు మరకలు ఉండటం చూసి నిలదీసింది. దీంతో బాలిక అసలు విషయం చెప్పింది. అదే రోజు రాత్రి తల్లి నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాజేశ్వరి, కళావతిలతో పాటు మైనర్‌పై అత్యాచారం చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రేయసి కాదంది.. గొంతుకోసుకుని.. వీడియోను ఫ్రెండ్స్‌కు పంపాడు..
యాక్సిడెంట్ లో భర్త మృతి! పోలీసులు కూడా ఊహించని ట్విస్ట్!