'ఆశ పడు తప్పులేదు.. అత్యాశ పడొద్దు..' పెద్దలు ఊరికే అన్నారా! ఈ మాట. ఏరోజైనా మీ జీవితంలో అలాంటి సందర్భం రావొచ్చు.. అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండండి అని ముందే హెచ్చరించారు. కానీ మనం దాన్ని పట్టించుకున్న పాపాన పొవట్లేదు.
‘ఆశ పడు తప్పులేదు.. అత్యాశ పడొద్దు మొదటికే మోసం వస్తుంది..‘ పెద్దలు ఊరికే అన్నారా! ఈ మాట. ఏరోజైనా మీ జీవితంలో అలాంటి సందర్భం రావొచ్చు.. అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండండి అని ముందే హెచ్చరించారు. కానీ మనం దాన్ని పట్టించుకున్న పాపాన పొవట్లేదు. ఇక అమ్మాయిల కోరికలకు, వారి కలలకు అయితే హద్దే లేదు. ‘కిందకు వస్తే చందమామను కూడా దాచేస్తారనుకోండి’ అది వేరే విషయం. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఓ వ్యక్తి వారిని నిండా ముంచాడు. మీ కలల రాకుమారుడిని నేనేనంటూ.. అందరినీ బుట్టలో వేసుకొని.. అందినకాడికి దోచుకున్నాడు. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్, ముజఫర్‌నగర్ కు చెందిన విశాల్(26) ఒక ఉన్నత విద్యావంతుడు. బీసీఏ, ఎంబీఏ వంటి పెద్ద చదువులు చదివి.. గుర్గావ్‌లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్‌ఆర్ గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు లక్షల్లో డబ్బు సంపాదించాలన్న ఆశతో ఆ ఉద్యోగం మానేసి సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టాడు. కానీ వ్యాపారం సరిగా నడవలేదు. లక్షల్లో నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అమ్మాయిలను బురిడీ కొట్టించే అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. బాగా డబ్బున్నా బ్యాచిలర్‌లా నటిస్తూ పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేయడమే అతగాడి పని.
అందుకు మ్యాట్రిమోనీ సైట్లను అవకాశంగా మలుచుకున్నాడు. ఇతని ప్రోఫైల్ చూసి ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా! వారు బలి అవ్వాల్సిందే. వారికి అద్దెకు తెచ్చుకున్న లగ్జరీ కార్లు, బంగ్లాలు చూపిస్తూ ధనవంతుడిలా బిల్డప్ ఇచ్చేవాడు. ఆపై మాయమాటలు చెప్పి వాళ్ల దగ్గర నుంచి లక్షల్లో డబ్బు గుంజేవాడు. అనంతరం నెంబర్ మార్చేసి.. మరో వేటకు సిద్ధమయ్యేవాడు. ఇలానే గుర్గావ్‌కు చెందిన ఓ యువతి, మ్యాట్రిమోనీలో అతని ప్రోఫైల్ చూసి.. మనసు పారేసుకుంది. అతడిచ్చిన బిల్డప్ కు యువతి కుటుంబసభ్యులు అందరూ ఇతడే మా అల్లుడు అనడం మొదలుపెట్టేశారు.
ఇదే అదను అనుకున్న సదరు యువకుడు.. యువతి, ఆమె స్నేహితులకు విదేశాల నుంచి ఖరీదైన ఫోన్‌లు,ఇతర వస్తువులు తక్కువ ధరకే తెప్పిస్తానని చెప్పి డబ్బులు దండుకున్నాడు. ఇలా మొత్తం రూ.3.05 లక్షలను బాధితురాలి నుంచి రాబట్టాడు. ఆ తర్వాత యువతి వస్తువుల గురించి అడగడంతో మొహం చాటేశాడు. కొన్నాళ్లకు ఆమె నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టేశాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతగాడి విశ్వరూపం బయటపడింది. అలా అని ఈజీగా దొరికాడు అనుకోకండి. పోలీసులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో డెకాయ్ ఆపరేషన్ చేయించి నిందితుడుపట్టుకున్నారు. ఆమె ద్వారా ఓ ఏరియాకు రప్పించి అక్కడ అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది చదివాక అయినా అత్యాశ పడటం మానేస్తారని ఆశిస్తున్నాం.. ఈ సంఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.