బెంగుళూరులోని ధణిసంద్రలోని ఏకే కాలనీలో నివాసం ఉంటున్న ప్రకాష్(39) అనే వ్యక్తి.. బీబీఎంపీ యలహంక ఉప విభాగంలో బ్యాటరాయణపురలో ఉన్న కార్పోరేషన్ కార్యాలయంలో అకౌంట్స్ విభాగంలో ఎస్‌డీఏగా ఉద్యోగం చేస్తున్నాడు. చాలా కాలం నుండి నమ్మకంగా పనిచేస్తుండడంతో ప్రకాష్‌కి అధికారుల దగ్గర మంచి పేరు ఉంది. కాంట్రాక్టర్ల డిపాజిట్లు, వారి బిల్లులు చెల్లించే పనులు చూసుకునేవాడు. రోజూ లక్షలు, కోట్ల లావాదేవీలు చూసేవాడు. ఈయనకి పెళ్ళి అయ్యింది. లక్షణమైన భార్య కూడా ఉంది. అయితే యలహంకలో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ కాంచనతో ప్రకాష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మోజులో పడి తాను పనిచేసే సంస్థలో అవినీతికి పాల్పడ్డాడు. ఇటీవల ఆడిటింగ్ అధికారుల పరిశీలనలో లక్షల్లో గోల్‌మాల్ అయినట్లు తేలడంతో ప్రకాష్ అడ్డంగా దొరికిపోయాడు.
ఆడిటింగ్ సమయంలో ప్రకాష్ లీవ్‌లో ఉన్నాడు. బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకున్న అకౌంట్స్ విభాగం అధికారులు లెక్కలు పరిశీలించి చూడగా షాకయ్యారు. బీబీఎంపీ కార్యాలయం బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్ అవ్వాల్సిన రూ. 14.07 లక్షల రూపాయల నగదు బ్యూటీషియన్ కాంచన అకౌంట్‌లో జమ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఆమె ఎవరు అని ఆరా తీయగా ప్రకాష్ ప్రియురాలు అని, ఆమెతో ప్రకాష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. ఆమె మోజులో పడి సంతకాలు ఫోర్జరీ చేసి బీబీఎంపీ అకౌంట్ నుంచి కాంచన అకౌంట్‌కి రూ. 14 లక్షలకు పైగా నగదు బదిలీ చేశాడని విచారణలో తేలింది. ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేసిన బీబీఎంపీ ఉద్యోగి ప్రకాష్‌తో పాటు అతని ప్రియురాలు కాంచనను పోలీసులు అరెస్ట్ చేశారు.
#BBMP ಯ ಲಕ್ಷಾಂತರ ಹಣ ಪ್ರೇಯಸಿ ಖಾತೆಗೆ ಜಮೆ… ಎಸ್ಡಿಎ ಸೇರಿ ಇಬ್ಬರ ಬಂಧನ
This is why from day one @Rajeev_GoI
& @Namma_Bengaluru
is demanding for timely audit of BBMP finances @BBMPAdmn @BBMPCOMM @CMofKarnataka@BSBommaihttps://t.co/zNIJ2wK6WY— Suresh NR 🇮🇳🇮🇳🇮🇳 (@sureshnr) August 24, 2022