ఈమె పేరు కృష్ణవేణి. గతంలో గోపయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. అయితే ఇటీవల ఓ రోజు ఆమె భర్త.. అతని తమ్ముడితో చేతులు కలిపి దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు చూస్తుంటే, వింటుంటే.. వెన్నులో వణుకు పుడుతుంది. కొందరైతే.. కొన్ని సమస్యలకు మనుషులను చంపేడమే పరిష్కారంగా భావిస్తున్నారు. ఇలా దేశంలో చాలా చోట్ల అన్యాయంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ వ్యక్తి కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా సొంత తమ్ముడితో చేతులు కలిపి దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇంతకు అన్నదమ్ములు చేసిన దారుణం ఏంటి? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటంటే?
పోలీసులు కథనం ప్రకారం.. బాపట్ల పరిధిలోని నందిరాజుతోట గ్రామంలో జొన్న గోపయ్య-కృష్ణవేణి (21) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా గడిపారు. అలా కొన్ని రోజులకు వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ప్రస్తుతం కృష్ణవేణి గర్భవతి కావడం విశేషం. ఇదిలా ఉంటే, భర్త గోపయ్య హైదరాబాద్ లోని ఓ ఎయిర్ పోర్టులోని హోటల్ లో పని చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. భార్య మాత్రం అత్తగారింట్లో ఉంటుంది. అయితే కృష్ణవేణి స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అత్తమామలతో పాటు మరిది అనుమానించారు. ఇదే విషయంపై గొడవలు కూడా జరిగాయి.
ఇటీవల ఓ రోజు వదిన రాత్రి పూట ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుందని మరిది తన అన్న గోపయ్యకు ఫోన్ చేసి వివరించాడు. దీంతో అతడు హుటాహుటినా ఇంటికి చేరుకున్నాడు. ఇక పక్కా ప్లాన్ తోనే అన్నదమ్ములు ఇద్దరూ కలిసి గురువారం రోజు కృష్ణవేణిని దారుణంగా కొట్టారు. దీంతో ఆ వివాహిత మరణించింది. ఆ తర్వాత కృష్ణవేణి బాత్రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా అన్నదమ్ములు చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూతురుని ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ తర్వాత మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి హత్యగా నిర్ధారించారు. అనంతరం అత్తమామలతో పాటు భర్త, అతడి తమ్ముడిని కూడా విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త గోపయ్య, అతడి తమ్ముడు శివబాబులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి తల్లిదండ్రులు స్పందించి.. మా కూతురి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.