ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం ఈ దంపతులు బాగానే కలిసి ఉన్నారు. కొన్నాళ్లకి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. కట్ చేస్తే.. ఈ మధ్య కాలంలో ఈ యువతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఇంట్లో చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ మహిళ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
లక్ష్మీ ప్రసన్నకు చదువంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివింది. అయితే చదువుతున్న క్రమంలోనే తల్లిదండ్రులు ఆమెకు ఓ వ్యక్తితో వివాహం జరిపించి చేతులు దులుపుకున్నారు. కొన్నాళ్ల పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగింది. ఇక పెళ్లై కొన్నాళ్లు గడిచిందో లేదో.. వీరి సంసారంలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఆ మహిళకు భర్తతో ఉండడం ఇష్టం లేక అతడి నుంచి దూరం జరిగింది. ఇక ప్రసన్న కొన్నాళ్ల నుంచి సచివాలయ ఉద్యోగిగా విధులు నిర్వర్తించింది. కాగా, ప్రసన్న ఉద్యోగం చేస్తూనే చివరికి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కడవకుదూరు గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న(30)కు చదువుపై ఇష్టంతో కొంత వరకు చదివింది. ఆమె చదువుకుంటున్న సమయంలోనే తల్లిదండ్రులు ప్రసన్నకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. ఇక పెళ్లైన కొన్ని రోజులు ఈ దంపతుల సంసారం బాగానే ముందుకు సాగింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పెద్దలు కలగజేసుకుని సర్దిచెప్పినా ఫలితం లేకుండ పోయింది. దీంతో ప్రసన్న భర్తతో విడిపోయి దూరం జరిగింది. ఆ తర్వాత ఆమె కొన్నాళ్ల నుంచి చీరాల పట్టణంలోని విఠల్ నగర్ లో సచివాలయ శానిటరీ సూపర్ వైజర్ గా విధులు నిర్వర్తించారు.
ఇకపోతే ప్రసన్న తల్లిదండ్రులు ఆమెకు రెండో వివాహం చేయాలని సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రసన్న తీవ్ర మనస్థాపానికి గురై గురువారం జాండ్రంపేట రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండో పెళ్లి అంశంపై ప్రసన్న మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మీ ప్రసన్నది హత్యనా? లేక ఆత్మహత్యనా అనేది తేల్చే పనిలో ఉన్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.