ఆదివారం కావటంతో ఆ కుటుంబం ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లింది. చిన్నారి ప్లే జోన్‌లోని ఆడుకుంటూ ఉండగా అనుకోని విషాదం చోటుచేసుకుంది. ఆ చిన్నారి చెయ్యి అక్కడి ఓ మిషన్‌లో పడింది.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మాల్లో సరదాగా ఆడుకోవటానికి వెళ్లిన చిన్నారికి ప్రమాదం జరిగింది. ప్లే జోన్‌లోని మిషిన్‌లో పడి చిన్నారి చేతి వేళ్లు నలిగిపోయాయి. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం కావటంతో భార్య, కూతురితో కలిసి బంజారాహిల్స్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే చిన్నారి మాల్లోని ప్లేజోన్‌లో ఆడుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత అనుకోని దారుణం జరిగింది. అక్కడి ఓ మిషిన్‌లో చిన్నారి కుడి చెయ్యి పడింది. దీంతో చేతి వేళ్లు మొత్తం నలిగిపోయాయి. ఓ వేలు సైతం తెగి కింద పడిపోయింది.
అక్కడే ఉన్న వాళ్లు వెంటనే స్పందించారు. ఆ మిషిన్ దగ్గరినుంచి పాపను పక్కకు తీసుకువచ్చారు. ఆ వెంటనే హుటాహుటిని చిన్నారిని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చిన్నారి చేతి వేళ్లకు సర్జరీ చేశారు. ఇక, ఈ సంఘటనపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాల్ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన పాపకు ప్రమాదం జరిగిందని ఆరోపించాడు. సరైన రక్షణ ఏర్పాట్లు చేయకపోవటం వల్లే తన కూతురికి ఈ పరిస్థితి వచ్చిందని వాపోయాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.