ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహ జరిగింది. కొన్నాళ్ల పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. ఈ క్రమంలోనే ఆ మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయమే చివరికి వివాహేతర సంబంధంగా మారింది. భర్తకు తెలియకుండా కొన్నాళ్ల పాటు బాగానే మెయింటెన్ చేసింది. చివరికి భర్తను చంపి ప్రియుడికి దగ్గరవ్వాలని ప్లాన్ వేసింది. ఇక అనుకున్నట్టుగానే ఆ మహిళ తాను అనుకున్నట్లు చేసింది.
ఇక్కడ కనిపిస్తున్న యువతి పేరు ఖోష్నహర్. వయసు 21 ఏళ్లు. చిన్న వయసులోనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయినా భర్తతో బుద్దిగా సంసారం చేయకుండా అడ్డదారులు తొక్కి పరాయి మగాడిపై మనసుపడింది. ఇంతటితో సరిపెట్టని ఈ కిలాడీ లేడీ.. క్షణిక సుఖం కోసం ప్రియుడితో అన్నీ చేసింది. అలా కొన్నేళ్ల పాటు చీకటి కాపురాన్ని భర్తకు తెలియకుండా నడిపిస్తూ వచ్చింది. ఇక రాను రాను ఆమెకు భర్త కంటే ప్రియుడంటేనే ఇష్టం పెరిగిపోయింది. ఇలా అయితే కాదని భావించి.. ఏకంగా ప్రియుడితో చేతులు కలిపి తాళికట్టిన మొగుడికి పాడె కట్టింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ కిషోర్ గంజ్ నికోలి పరిధిలోని గురై గ్రామం. ఇక్కడే అలె ఇమ్రాన్ (32), ఖోష్నహర్ (21) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ ఇల్లాలు భర్తతో బాగానే సంసారం చేసింది. కానీ, రాను రాను తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. విషయం ఏంటంటే? ఖోష్నహర్ కు స్థానికంగా ఉండే అహ్మద్ నయీమ్ అనే యువకుడితో పరిచయం పెరిగింది. ఆ పరిచయంతోనే ఇద్దరు ఇంకాస్త దగ్గరై చివరికి వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు. దీంతో ఆ మహిళ భర్త కళ్లు గప్పి ఎంచక్కా ప్రియుడితో సరసాలకు దిగేది. తన చీకటి కాపురాన్ని భర్తకు తెలియకుండా కొన్నాళ్ల పాటు బాగానే మెయింటెన్ చేస్తూ వచ్చింది.
కానీ, ఆ మహిళ భర్తతో కన్నా ప్రియుడితో ఉండేందుకే ఇష్టపడింది. ఇలా అయితే కాదని భావించిన ఆ మహిళ.. భర్తను హత్య చేసి ప్రియుడుకి దగ్గరవ్వాలనుకుంది. దీని కోసం పక్కా ప్లాన్ తో మొగుడి హత్యకు పథకం రచించింది. ఇక ఇందులో భాగంగానే ఖోష్నహర్ భర్త ఇమ్రాన్ ను నమ్మించి గత ఆదివారం జఫ్లాంగ్ కు తీసుకెళ్లింది. వీరి వెనకాలే ఆమె ప్రియుడు కూడా వెళ్లినట్లు సమాచారం. ఆ దంపతులు అక్కడికి వెళ్లి హోటల్ లో ఓ రూమ్ తీసుకున్నారు. ఇక మరుసటి రోజు ఖోష్నహర్ తన ప్రియుడు నయీమ్ కు ఫోన్ చేసి వారున్న రూమ్ కి రమ్మని కబురు పంపింది. ఇక అతడు వెళ్లగానే ఇద్దరూ కలిసి ఇమ్రాన్ ను దారుణంగా హత్య చేసి పక్కనే ఉన్న ఓ నది సమీపంలో ఇమ్రాన్ శవాన్ని వదిలేసి పరారయ్యారు.
అప్పటి నుంచి ఇమ్రాన్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా జఫ్లాంగ్ పరిధిలో ఉన్న నది పక్కన ఇమ్రాన్ శవం కనిపించింది. ఇక మృతుడి భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఇమ్రాన్ భార్య ఖోష్నహర్ వివాహేతర సంబంధం బయటపడింది. ఇక పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా ఏప్రిల్ 19న ఖోష్నహర్, ఆమె ప్రియుడు నయీమ్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడి కోసం భర్తను చంపిన ఈ కిలాడి లేడీ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.