అమ్మాయిలే కదా ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. అవును.. మీరు విన్నది నిజమే. పాపం అని ఓ కంపెనీ ఓనర్ ఓ యువతికి ఉద్యోగం కలిపిస్తే.. చివరికి అతడినే నిండా ముంచింది ఆ యువతి. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే మీరు నోళ్లు తెరవడం ఖాయం.
పైన అందంగా కనిపిస్తున్న అమ్మాయిల్లో ఓ యువతి పేరు రీతూ. వయసు పాతికేళ్లలోపే. అయితే ఇప్పుడు ఈమె గురించి ఎందుకంటారా.. చెప్తా, చెప్తా.., విషయం ఏంటంటే? గతంలో ఈ యువతి ఓ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగంలో చేరింది. విధుల్లో చేరిన కొన్నాళ్ల పాటు బుద్దిగా తన పని తానూ చేసుకుని మంచి పేరే తెచ్చుకుంది. కానీ, రాను రాను ఆ యువతి తన వక్రబుద్దిని చూపించి ఏకంగా ఉద్యోగం కల్పించిన ఆ కంపెనీ ఓనర్ కే షాకిచ్చింది. ఇంతకి ఆ యువతి చేసిన పనేంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరుకు చెందిన రీతూ అనే యువతి కొన్నాళ్ల నుంచి ఉద్యోగం కోసం అన్వేషణ మొదలు పెట్టంది. ఈ క్రమంలోనే ఆమెకు విద్యారణ్యపురలో ఓ ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేసిన వెంకటేష్ రెడ్డి అనే ఓనర్ రీతూకి రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం కల్పించాడు. దీంతో ఆ యువతి చాలా కాలం పాటు బుద్దిగా పని చేస్తూ కంపెనీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను కూడా తెలుసుకుంది. కంపెనీ ఓనర్ సైతం ఆ యువతిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. కానీ, ఆ యువతి మాత్రం ఉద్యోగం ఇచ్చిన వ్యక్తికే షాకిచ్చింది. ఏం చేసిందంటే? ఆ యువతి కొన్నాళ్ల నుంచి కంపెనీ లాభాల్లో వచ్చిన నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం, ఫోన్ పే, గూగుల్ పే వంటి వ్యవహారాలను కూడా చూసుకునేది. దీనినే ఆ యువతి ఆసరాగా చేసుకుంది.
ఇందులో భాగంగానే ఇటీవల కంపెనీ డబ్బును ఫోన్ పే, గూగుల్ పే ద్వారా తన బాయ్ ఫ్రెండ్ తో పాటు తన ఇద్దరు చెల్లెల్ల ఖాతాలకు 2.70 లక్షల నగదును బదిలీ చేసింది. అంతేకాకుండా ఆమె చెల్లెల్ల స్నేహితులకు కూడా డబ్బులు పంపించింది. అయితే కొన్నిరోజుల తర్వాత కంపెనీ డబ్బుల ట్రాన్స్ ఫర్ వ్యవహారాలపై ఓనర్ కు కాస్త అనుమానం కలిగింది. ఏం జరిగిందని పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలకు నగదు వెళ్లినట్లుగా తేలింది. దీంతో కంపెనీ ఓనర్ వెంకటేష్ రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇక పోలీసులు విచారణ జరపగా.. కంపెనీ ఉద్యోగి అయిన రీతూ ఈ వ్యవహరం నడిపి ఇతరులకు పంపిందని తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు నిందితురాలైన రీతుతో పాటు ఆమె చెల్లెల్లను కూడా అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.