కాపాడాల్సిన ఖాకీయే ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాదు.. ఆమె నడుం గిల్లుతో పక్క రూంలోకి రావాలని కామక్రీడలకు తెరలేపాడు. అక్కడినుండి యువతి తప్పించుకొని ఎలాగోలా ఇంటికి చేరుకున్నా అతని వేధింపులు ఆగలేదు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళతో ఎస్‌ఐ అసభ్యంగా ప్రవర్తించాడు. రూంకి రావాలని వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఊరుకున్నాడా! అంటే అదీ లేదు. మహిళ నెంబర్ తీసుకొని.. ఆమెకు అసభ్యకర సందేశాలు పెట్టి మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళింది..? అతడు ఆమెకు ఎలాంటి సందేశాలు పంపాడో తెలిస్తే.. ఆ ఖాకీ ఎంతలా దిగజారిపోయాడో మీకే అర్థమవుతుంది.
వరకట్న వేధింపుల కేసులో సాక్షిగా ఉన్న ఓ మహిళను సుద్ధగుంటపాళ్య పోలీసు స్టేషన్ ఎస్ఐ మంజునాథస్వామి స్టేషన్‌కు పిలిపించుకున్నాడు. ఆమె తన వాగ్మూలం ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఎస్ఐ ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సింది పోయి తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె నడుం గిల్లడమే కాకుండా.. క్యాబిన్ పక్కన ఉన్న రూంలోకి రావాలంటూ కామక్రీడలకు తెరలేపాడు. అక్కడి నుండి ఎలాగోలా బయటపడ్డ యువతి ఇంటికి చేరుకున్నా అతని వేధింపులు ఆగలేదు. అసభ్యకర సందేశాలు పెట్టి వేధిస్తూ, ప్రైవేట్ ఫోటోలు పంపాలంటూ యువతిని మానసికంగా కాల్చుకుతిన్నాడు.
గంటలు గడిచే కొద్దీ అతని వేధింపులు మరింత ఎక్కువ అవ్వడంతో బాధిత యువతి.. సదరు సందేశాలకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బెంగుళూరు బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్ గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి స్టేట్ మెంట్ ప్రకారం.. ‘స్నేహితురాలి విడాకుల కేసులో సాక్షిగా ఆమె స్టేషన్‌కు హాజరైంది. ఎస్‌ఐ మంజునాథస్వామి మొదట చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. అనంతరం విచారణ సమయంలో ఆమె చేతులు పట్టుకుని ముద్దు పెట్టడానికి యత్నించాడు”.
“ఆ తరువాత కాసేపటికే ఆమె నడుం గిల్లి, క్యాబిన్ పక్కన ఉన్న రూంకు రావాలని పిలిచాడు. ఆ సమయంలో బాధిత యువతి తల్లి ఫోన్ చేయటంతో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లి.. అతడి నుంచి తప్పించుకున్నట్లు వివరించింది. ఆపై ఇంటికి చేరుకున్నా వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పెట్టి మానసికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇంటికి వెళ్లాక వాట్సాప్‌లో తన ప్రైవేట్ ఫోటోలు పంపాలని బలవంతం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది”. ఈ ఘటనపై డీసీపీ సీకే బాబా స్పందించారు. పిర్యాదు చేసిన మాట వాస్తవమేనని.. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఖాకీపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.