వారిది 16 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. అలాంటి దాంపత్యంలో బ్యూటీ పార్లర్ ఆంటీ చిచ్చు పెట్టింది. లక్ష్మీపతికి ఓ బ్యూటీ పార్లర్ ఆంటీతో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
వివాహేతర సంబంధాల కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. అంతేకాదు! కుటుంబాలు, కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరూ వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు. తద్వారా భార్యను భర్త చంపటమో.. భర్తను భార్య చంపటమో జరుగుతోంది. తాజాగా, ఓ వ్యక్తి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన భార్యను చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు జిల్లాలోని దేవనహళ్లి తాలూకా..
బడావణయల్లికి చెందిన జయంతి, లక్ష్మీపతి భార్యాభర్తలు. వీరికి పెళ్లయి 16 సంవత్సరాలు అవుతోంది. ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. జయంతి తన భర్త, ఓ కూతురు, అత్తామామలతో కలిసి హాయిగా జీవిస్తోంది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీపతికి విజయపుర పట్టణానికి చెందిన ఓ బ్యూటీ పార్లర్ ఆంటీతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం గురించి జయంతికి తెలిసింది. తన భర్తను నిలదీసింది. ఇక, అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీంతో జయంతిపై కక్ష పెట్టుకున్న భర్త పుట్టింటినుంచి డబ్బులు తీసుకురమ్మని ఆమెను నిత్యం వేధించేవాడు.
కొద్దిరోజుల క్రితం జయంతికి ఉరి వేసి హత్య చేశాడు. తర్వాత ఆమె శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. లక్ష్మీపతి తమ కూతుర్ని హత్య చేశాడంటూ జయంతి కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంత పరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్యా లేక హత్య అన్న కోణాల్లో విచారణ చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.