హీరోయిన్ సాయిపల్లవిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని భజరంగ్ దళ్ నాయకులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. రానా హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా సాయిపల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో కాశ్మీర్ ఫైల్స్ తో పాటు గో రక్షకులపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: GHMC అధికారులును పరుగులు పెట్టించిన అనుపమ పరమేశ్వరన్.. థాంక్స్ చెబుతున్న నెటిజన్లు!
హీరోయిన్ సాయి పల్లవి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన భజరంగ్ దళ్ నాయకులు.#SaiPallavi #bajarangdal #KashmirFiles #TheKashmirFiles #NTVTelugu pic.twitter.com/aFOsKmsbC3
— NTV Telugu (@NtvTeluguLive) June 16, 2022