Backdoor Jobs: హైదరాబాద్‌లో ఘరానా మోసం జరిగింది. ఐటీ సంస్థ పేరుతో కొంతమంది వ్యక్తులు నిరుద్యోగులను దోచుకున్నారు. దాదాపు 800 మందినుంచి రూ. 20 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్‌వేర్ జాబులు ఇప్పిస్తానని 800 మంది నుంచి.. ఒక్కోరి దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇలా అందరి దగ్గరినుంచి 20 కోట్లు వసూలు చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వారిని ఇంటికి పంపింది. 800 మందికి రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. ఈ రెండు నెలల ట్రైనింగ్‌లో వారికి జీతాలు కూడా ఇచ్చింది.
అయితే, రెండు వారాల క్రితం సదరు కంపెనీ తమ వెబ్‌సైట్లు, మెయిల్స్‌ను బ్లాక్ చేసింది. దీంతో ఉద్యోగులు మొత్తం షాక్ అయ్యారు. ఏం జరిగిందో ప్రశ్నించేందుకు ఆఫీసు దగ్గరకు వెళ్లారు. అయితే, అక్కడ సాఫ్ట్‌వేర్ సంస్థ బోర్టు కానీ, ఉద్యోగులు కానీ, కనిపించలేదు. దీంతో తాము మోసపోయినట్లు డబ్బులు కట్టిన వారు గుర్తించారు. బాధితులంతా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారం గడుస్తున్నా పట్టించుకోవటం లేదని స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 60 మంది బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. బ్యాక్ డోర్ ఉద్యోగాలను నమ్మొద్దని హెచ్చరించారు. డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించటం మంచి పద్దతి కాదన్నారు. ప్రస్తుతం కమలేష్ కుమారి, రాహుల్ అలోక్, వైష్ణవి, ముద్ర, ప్రదీప్‌లను కంపెనీలోని హెచ్ ఆర్, మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వారిగా గుర్తించామన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vijayawada: పసి పిల్లలకు బతికుండగానే నరకం చూపించిన తండ్రి.. ఇల్లు వదిలి బయటకొచ్చిన చిన్నారులు!