ఇంత టెక్నాలజీ, అభివృద్ది అందుబాటులోకి వచ్చాక కూడా సమాజంలో ఇంకా అనాగరికమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమాయకపు ప్రజలను ఆసరాగా చేసుకుని నట్టేట ముంచుతూ, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
నేటి సమాజంలో ఆడవాళ్ల మీద అఘాత్యాలు చేయడం అనేది రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సమాజంలో మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చినా.. ఈ కామందులలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా పోతుంది.అయితే ముఖ్యంగా అమ్మాయిలు కనబడితే వాళ్ల మీద దృష్టి పడడం.. వాళ్లని వేధించడం అనేవి జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మారు వేషాలలో వచ్చి మీ సమస్యలకు పరిష్కారం చేస్తామని నమ్మించి వాళ్లని క్షణాలలో మోసం చేయడం జరుగుతుంది. అయితే తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే వరంగల్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ లో ఒక మంత్రగాడు కుటుంబ సమస్యలను పరిష్కారం చెబుతానని.. అలాగే భార్య భర్తల మధ్య తగాదాలు, ఇంకా ఎవరైనా ఆ ఊర్లో ఉండే పిల్లకు కానీ పెద్దలకు ఆరోగ్య సమస్యలు వచ్చినా పరిష్కారం చేస్తానంటూ ఊర్లో ఉన్న చుట్టు పక్కల వారందరినీ నమ్మించుకుంటూ జీవనం సాగించేవాడు. అలా కొన్ని రోజులు అందరిని చూస్తూ, నమ్మించి ఫేమస్ అయిపోయాడు. అయితే ఇప్పుడిప్పుడే తన అసలు విశ్వరూపం బయటకి వచ్చింది. అది ఎలా అంటే కుటుంబ సమస్యలతో వచ్చిన మహిళలు, యువతులు మాత్రం వచ్చారు. వాళ్లని భయపెట్టించి, మాయా మాటలు చెప్పి యువతులను లోబర్చుకొని అత్యాచారాలు చేసుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలోనే ఓ మహిళ తన భర్తతో ఉన్న విభేదాలను పరిష్కారించాలంటూ గత కొన్నిరోజుల క్రితం ఓ మహిళ దొంగ బాబా లబ్బేను సంప్రదించగా.. పూజలు చేస్తున్నట్టు నటించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే ఈ విషయాన్ని వెంటనే ఆమె ఇంట్లో చెప్పింది. ఆమె చెప్పగానే భాదితురాలితో పాటు, ఆమె కుటుంబ సభ్యులు టాస్క్ ఫోర్స్ పోలీసులను కలవడంతో దొంగ బాబా బాగోతం అంతా బయటపడింది. ఆ దొంగ బాబా నుంచి రూ.25 వేల నగదుతో పాటు.. తాయత్తులు, వన మూలికలు, దారాలు, నిమ్మకాయలు, నూనె డబ్బాలు, ఇలా పలు రకాల వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. అయితే టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం జితేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే తమిళనాడుకు చెందిన షైక్నాలా లబ్బే దొంగ బాబా దాదాపు 40 సంవత్సరాల కిందటనే వరంగల్ నగరానికి వచ్చాడు. ఆ క్రమంలోనే ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్ట్ సమీపంలో నివాసం ఉంటూ బాబా ఈ అవతారమెత్తాడు. తనకు వచ్చిన మంత్ర శక్తులను ఉపయోగించి కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య గొడవలు, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పరిష్కారం చెబుతానంటూ అక్కడ చుట్టు పక్కల ఉన్న వారందరిని నమ్మించి.. ఇలా పలువురు మహిళలని, యువతులను నమ్మించి లోబర్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.