సాఫీగా సాగుతున్న వైవాహిక జీవితంలోకి వివాహేతర సంబంధాలు వచ్చి చేరి నిండు సంసారాలను నిట్టనిలువును చీల్చేస్తున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో వేలుపెడుతూ హత్యలు లేదంటే ఆత్మహత్యలకు వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనలోనే ఓ భర్త నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం. ఇనపనూరి జయరాజు, నిరోష ఇద్దరూ భార్యాభర్తలు. పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. అయితే గత కొన్ని రోజుల భార్య నిరోష ప్రవర్తనలో మార్పొచ్చి పక్కచూపులు చూసింది. కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడితో భార్య సరసాలకు దిగింది. అలా కొన్నాళ్లపాటు భర్తకు తెలియకుండా నిరోష తెరవెనుక సంసారాన్ని నడిపిస్తూ వచ్చింది.
ఇది కూడా చదవండి: ఇష్టమైన కోడి కూర వండనన్నందుకు భర్త ఆత్మహత్మ!
అయితే ఫిబ్రవరి 26 తేదీన భర్తకు తెలియకుండా భార్య నిరోష మిడ్ నైట్ యాపారానికి తెర తీసింది. వీరి చికటి సరసాలను చూసితట్టుకోలేక భర్త జయరాజు కృష్ణను నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య కాస్త గొడవ జరగడంతో భార్య నిరోష భర్తను చంపాలనుకుంది. ఇదే సమయాన్ని అదునుగా భావించిన భార్య భర్త జయరాజు తలపై రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేసింది. దీంతో భర్త మరణంపై అనుమానం రావడంతో అత్తింటివాళ్లు భార్య నిరోషను గట్టిగా నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాకు ఏం తెలియదంటూ కొత్త డ్రామాకు తెరతీసింది నిరోష. పోలీసులు తమదైన శైలీలో విచారించేసరికి వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో నేనే హత్య చేశానంటూ నిరోష తెలిపింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల వెలుగలోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.