ప్పటివరకు ఎన్నో రకాల ఏటీఎం మెషిన్ల దొంగతనాలు చూశాం.. ఏటీఎం అక్కడికక్కడే పగలగొట్టి అందులో ఉన్నది దోచుకోవడం లేదంటే అక్కడి నుండి మరొకచోటకి తీసుకెళ్లి అందులో ఉన్నది ఖాళీ చేయడం వంటి సంఘటనలు చూశాం.. కానీ, ఇది అంతకుమించి. టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు అప్ డేట్ అవుతున్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొంతపుంతలు తొక్కుతున్నారు. కస్టమర్లరా ఏటీఎంలలోకి ప్రవేశించి నిమిషాల్లో అందులో ఉన్న డబ్బంతా దోచేస్తున్నారు.
‘కూటి కోసం కోటి విద్యలు’ అన్న ఈ సామెత… ఎవరు ఏ రకంగా ప్రవర్తించి, ఎలాంటి పనులు చేసినా అది వారి బ్రతుకుదెరువు కోసమేననే అర్థాన్నిస్తుంది. ఇప్పుడు ఇదే నానుడిని దొంగల ప్రయత్నాలకు చెప్పుకోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఎన్నో రకాల ఏటీఎం మెషిన్ల దొంగతనాలు చూశాం.. ఏటీఎం అక్కడికక్కడే పగలగొట్టి అందులో ఉన్నది దోచుకోవడం లేదంటే అక్కడి నుండి మరొకచోటకి తీసుకెళ్లి అందులో ఉన్నది ఖాళీ చేయడం వంటి సంఘటనలు చూశాం.. కానీ, ఇది అంతకుమించి. దొంగలు టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ అవుతున్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొంతపుంతలు తొక్కుతున్నారు. కస్టమర్లరా ఏటీఎంలలోకి ప్రవేశించి నిమిషాల్లో అందులో ఉన్న డబ్బంతా దోచేస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో చోరీకి పాల్పడుతున్న ముఠాను అదే టెక్నాలజీ సాయంతో పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు పంపించారు. ఆ వివరాలు.. పంజాబ్‌కు చెందిన గుర్ గగన్‌సింగ్, భూపేందర్‌సింగ్, రష్‌పాల్, సందీప్‌సింగ్‌లు ఈ నెల10న రాజాపూర్ ఏటీఎంలో ఏజెన్సీ సిబ్బంది క్యాష్‌బాక్స్‌లో డబ్బులు పెట్టిన 10 నుంచి 15 నిమిషాల్లోనే దొంగిలించారు. ఏజెన్సీ సిబ్బంది మేన్యువల్ కోడ్ ఎంటర్ చేసి ఏటీఎం క్యాష్‌బాక్స్‌ను తెరిచి అందులో డబ్బులు పెడుతుంటారు. ఇలాంటి మేన్యువల్ కోడ్ కలిగిన ఏటీఎంలే ఈ ముఠా టార్గెట్. రాజాపూర్‌లో ఉన్న ఏటీఎం అలాంటిది కావడంతో వారి కన్ను దానిపై పడింది. ముందుగా వారం రోజుల పాటు ఏటీఎం సెక్యూరిటీ, ఏజెన్సీ సిబ్బంది రాకపోకలపై రెక్కీ నిర్వహించిన నిందితులు, క్యాష్‌బాక్స్ పాస్‌వర్డ్ తెలుసుకునేందుకు ముందుగానే లోపల వైఫై కెమెరాను అమర్చారు. ఆ కెమెరా సాయంతో వైఫై మోడెమ్ ద్వారా నిందితుల ఫోన్‌కు పంపుకున్నారు.
ఇంకేముంది.. ఏజెన్సీ సిబ్బంది డబ్బులు పెట్టి వెళ్లిన కొద్దిసేపటికే నిందితులు ఏటీఎంలోకి వెళ్లి పాస్‌వర్డ్ ద్వారా క్యాష్‌బాక్స్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ విషయంపై బ్యాంకు సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న ఏజెన్సీ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. పిర్యాదు అందుకున్న పోలీసులు ఏటీఎం బ్రేక్ కాకుండానే డబ్బులు మాయమయ్యమవ్వడంతో.. ఏజెన్సీ సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, విచారణలో వారి ప్రమేయంలేదని తేలడంతో మరో కోణంలో దర్యాప్తు చేపట్టగా.. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా వారికి చిక్కారు. ఒక టోల్‌గేట్ దగ్గర దొరికిన ఫాస్టాగ్ కోడ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరికోసం గాలిస్తున్న క్రమంలో మంగళవారం బాలానగర్ ఏటీఎం దగ్గర అనుమానాస్పదంగా ఇధ్దరు తచ్చాడడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ ముఠా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు కొంటూ జల్సాలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు.
ఈ నలుగురు నిందితుల్లో ఒకరైన భూపేందర్‌సింగ్ 15ఏళ్లపాటు ఏటీఎం టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో అతడికి ఏటీఎంలలో నగదు అప్‌లోడ్ చేయడం, మేన్యువల్ కోడ్ ఎంటర్ చేయడంపై అవగాహన ఉంది. దీంతోనే ఈ తరహా చోరీలకు అలవాటు పడ్డారు. గతేడాది డిసెంబరు సంగారెడ్డి పరిధిలోని ఏటీఎంలో రూ.30 లక్షలు, నల్లగొండలో రూ.3లక్షలు కాజేసింది వీరిపనే అని గుర్తించారు. ఇంకా ఎక్కడక్కడ చోరీలు చేశారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.