శ్రద్దా వాకర్ ఘటన మరువకముందే అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త, అత్తను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టింది. ఆ తర్వాత అదే ముక్కలను ఓ లోయలో పడేసింది. ఇంతటి దారుణ ఘటనలో అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భర్త, అత్తతో గొడవపడి చివరికి ఊహించని కిరాతకానికి పాల్పడింది. భర్తను, అత్తను ప్రియుడితో కలిసి ముక్కలు ముక్కలుగా నరికింది. ఆ తర్వాత అదే ముక్కలను ఫ్రిజ్ లో పెట్టి కొన్ని రోజుల తర్వాత ఓ లోయలో పడేసింది. దాదాపుగా ఏడు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. అది అసోంలోని గువహటి పరిధిలోని నరేంగి ప్రాంతం. ఇక్కడే అమర్ జ్యోతి డే-బందన అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఆ వివాహిత భర్తతో బాగానే మెలిగింది. అయితే అమర్ జ్యోతి తల్లి కూడా వీరి ఇంట్లోనే ఉండేది. అలా కొన్ని రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా రోజులు గడుస్తున్న కొద్ది భార్య బందన తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. భర్తను కాదని స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.
భర్తకు తెలియకుండా ఆ మహిళ ప్రియుడితో ఎంచక్కా తెర వెనుక రాసలీలను నడిపించింది. ఇక రాను రాను బందన భర్తతో కంటే ప్రియుడితోనే ఉండాలని ఆశపడింది. ఈ క్రమంలోనే బందన .. భర్త అమర్ జ్యోతి డేతో పాటు అత్తతో ఆస్తి విషయంలో గొడవ పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే బందనకు భర్త, అత్త అంటే అస్సలు ఇష్టం లేకుండా పోయింది. ఇక ఎలాగైన భర్త, అత్తను దూరం పెట్టాలని బందన తనలో తాను అనుకుంది. ఇలా వీరితో గొడవ పడుతూనే బందన ప్రియుడితో ఎంజాయ్ చేసేది.
ఈ క్రమంలోనే వందనకు ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అదే.. భర్త, అత్తను చంపడం. ఇదే విషయాన్ని వందన తన ప్రియుడికి చెప్పింది. దీనికి ఆమె ప్రియుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అనుకున్నదే ఆలస్యం.. బందన భర్త, అత్త హత్యకు ప్లాన్ గీసింది. ఇందులో భాగంగానే 2022 ఆగస్టు 17న వందన తన ప్రియుడితో చేతులు కలిపి భర్త అమర్ జ్యోతి డే, అత్తను దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత వారి డెడ్ బాడీలను ముక్కలు ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో పెట్టింది. ఇక మూడు రోజుల తర్వాత బందన ఫ్రిజ్ లో ఉన్న ముక్కలను మేఘాలయలోని దావ్కీ లోయలో పడేసింది.
అయితే అదే ఇంట్లోకి రిపేర్ చేయడానికి ఓ వ్యక్తి వచ్చాడు. ఇంట్లో రకపు మరకలతో కూడిన కొన్ని దుస్తువులు అతడికి కనిపించాయి. దీంతో ఇదే విషయం ఇరుగు పొరుగు వారికి కూడా తెలియడంతో పాటు ఇటీవల పోలీసులకు వరకు వెళ్లింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించి బందనను విచారించారు. అయితే పోలీసుల విచారణలో మొదట్లో బందన తనకేం సంబంధం లేదన్నట్లుగా చెప్పిన బందన.. తర్వాత సంచలన నిజాలు బయటపెట్టింది. ఇక జరిగిందంతా చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అనంతరం పోలీసులు నిందితులైన బందనతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. 7 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.