క్షణికావేశంలో కొందరు తీసుకునే నిర్ణయాల వల్ల ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు రూ.500 కోసం గొడవ పడి ఏకంగా మరో యువకుడి తల నరికాడు. తాజాగా అస్సాంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం మేరకు.. రాష్ట్రంలోని సొనిత్ పుర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఇటీవల ఫుట్ బాల్ మ్యాచ్ ను నిర్వహించారు. ఇందులో తునిరామ్ మాద్రి, బోయిలా హమ్ రామ్ అనే యువకులు సైతం ఈ పోటీల్లో పాల్గొన్నారు.
అయితే ఆటకు ముందు తునిరామ్ మాద్రిని బోయిలా హోమ్ రామ్ అనే యువకుడు రూ.500 అప్పు అడిగాడు. దీనికి ఆ యువకుడి లేవని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి బోయిలా హోమ్ రామ్ తునిరామ్ పై పగ పెంచుకున్నాడు. ఇక ఆటలో భాగంగా తునిరామ్ బెట్ లో ఓ మేకను గెలుచుకున్నాడు. ఆ మేకను కోసేందుకని తునిరామ్ అనే యువకుడు బోయిలా హోమ్ రామ్ ని పిలిచాడు. దీనికి బోయిలా రానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో పెద్ద గొడవకు దారి తీసింది.
ఇక కోపంతో ఊగిపోయిన తునిరామ్ మాద్రి.., బోయిలా హోమ్ రామ్ ను దారుణంగా హత్య చేసి అతని తల నరికాడు. నిందితుడు తునిరామ్ అదే తలతో నేరుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.