ప్రేమించిన వ్యక్తి మరోకరితో క్లోజ్ గా ఉంటే ఎలా ఉంటుంది. దీనిని ఎవరూ కూడా జీర్ణించుకోలేరు. అచ్చం ఇలాగే తట్టుకోలేకపోయిన ఓ యువతి.. ప్రియుడికి ఊహించిన ఝలక్ ఇచ్చింది. ఈ దెబ్బతో అతని తల ప్రాణం తోకకు వచ్చింది. అసలేం జరిగిందంటే?
ప్రేమ పేరుతో నేటి కాలం యువత విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కొందరైతే చదువును పూర్తిగా పక్కన పెట్టి ప్రేమించిన వారితో చెట్టా పట్టాలేసుకుని సినిమాలు, షికారులు అంటూ తెగ తిరుగుతున్నారు. దీంతో జీవితాలను నాశనం చేసుకూంటూ చివరికి ఎటు కాకుండా పోతున్నారు. ఇదిలా ఉంటే. ప్రేమించిన యువకుడు మరో అమ్మాయితో కనిపిస్తే ఆ ప్రియురాలికి ఎలా ఉంటుంది. దీనిని ఏ యువతి జీర్ణించుకోలేరు. కొందరు అమ్మాయిలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే, మరికొందరు మాత్రం ప్రియుడిపై పగ తీర్చుకుంటారు. అచ్చం ఇలాగే తన ప్రేమికుడు మరో యువతితో తిరుగుతున్నాడనే కోపంతో ప్రియురాలు ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే?
ఓ మీడియా కథనం ప్రకారం.. అర్జెంటీనాలో ఓ యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత కొన్ని రోజుల నుంచి ప్రేమలో ఉన్నట్లు సమాచారం. చాలా ఏళ్ల నుంచి ప్రేమ విహారంలో తేలియాడుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజుల నుంచి ఆ యువకుడు తన ప్రియురాలిని కాదని మరో యువతితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఇదే విషయం కొన్నాళ్లకి అతని ప్రియురాలికి తెలియంతో తట్టుకోలేకపోయింది. ఆ సమయంలో ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక ఎలాగైన తన ప్రియుడిపై పగ తీర్చుకోవాలని అనుకుంది.
ఇందులో భాగంగానే ఆ యువతి తన ప్రియుడిని నమ్మించి ఓ చోటుకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లాక తన ప్రియుడిని ఓ గదిలో బంధించించి. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు అందులోనే ఉంచి టార్చర్ పెట్టింది. మరో విషయం ఏంటంటే? కనీసం అతనికి తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిదంట. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మొత్తానికి ఆ యువకుడిని పోలీసులు రక్షించి దారుణానికి పాల్పడిన ఆ యువతిని అరెస్ట్ చేశారు. ప్రియుడు మరో యువతితో తిరుగుతున్నాడని బంధించి టార్చర్ చేసిన యువతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.