Kothapalli Geetha: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టయ్యారు. గీతతో పాటు ఆమె భర్త కూడా అరెస్టయ్యారు. రుణం ఎగవేత కేసులో ఈ ఇద్దర్నీ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గీత దంపతులు విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ పేరుతో తమ బ్యాంకులో 50 కోట్ల రూపాయల మేర రుణం తీసుకుని, తిరిగి చెల్లించలేదని ఆరోపిస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై గతంలోనే కేసు నమోదైంది. మంగళవారం ఈ కేసుపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు గీత దంపతులను దోషిగా తేల్చింది. గీత దంపతుల్ని అరెస్ట్ చేయటంతో పాటు.. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఫ్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 2 లక్షల రూపాయల జరిమానా విధించింది.
అవకతవకలకు సహకరించిన బ్యాంకు అధికారుల అరెస్ట్ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గీత భర్తతో పాటు, బ్యాంకు అధికారులను సీబీఐ పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, కొత్తపల్లి గీత సాధారణ బ్యాంకు ఉద్యోగి స్థాయినుంచి వ్యాపార వేత్తగా, రాజకీయ నాయకురాలిగా మారారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సబ్ కలెక్టర్‌గా.. విభజన తర్వాత అరకు ఎంపీగా పనిచేశారు. మరి, ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల అరెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: పోలీసు అసిస్టెంట్ కమిషనర్‌ను చితకబాదిని బీజేపీ కార్యకర్తలు!