ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రాధ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అసలు విలన్ ఎవరో తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకు రాధను హత్య చేసిన విలన్ ఎవరంటే..
ప్రకాశం జిల్లా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య రాధ హత్య కేసులో పోలీసులే విస్తుపోయే విషాయలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో రాధ బాల్య మిత్రుడు కాశిరెడ్డిని నిందితుడిగా భావించారు పోలీసులు. డబ్బులు ఇస్తానని చెప్పి.. రాధను తీసుకెళ్లి.. అత్యంత దారుణంగా హత్య చేశారని భావించారు. స్నేహితుడని నమ్మి కాశిరెడ్డికి.. సుమారు 80 లక్షల రూపాయలు ఇచ్చారు రాధ దంపతులు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే.. కాశిరెడ్డి ఇంత దారుణానికి ఓడిగట్టాడని అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో విలన్ ఎవరో తెలిసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. ఇంత తెలివిగా రాధను హత్య చేసిన ఆ విలన్ ఎవరంటే..
ఇక రాధ హత్య కేసులో అసలు విలన్ ఎవరంటే.. ఆమె భర్త మోహన్‌రెడ్డి. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. మోహన్‌రెడ్డి.. తన స్నేహితులతో కలిసి రాధను అత్యంత దారుణంగా హత్య చేశాడు. మరి కట్టుకున్న భార్యను ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడంటే.. రాధ మీద అనుమానం. కాశిరెడ్డికి, మృతురాలికి మధ్య సన్నిహిత సంబంధం ఉందని భావించిన మోహన్‌రెడ్డి.. పక్కా ప్లాన్ ప్రకారం భార్యను హత్య చేశాడు. ఉద్యోగం కోల్పోయి.. బాధలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడం కోసం రాధ దంపతులు అతడికి 80 లక్షల రూపాలయ వరకు అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి అడిగే విషయంలో.. రాధ, మోహన్‌రెడ్డి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. రాధ, కాశిరెడ్డికి మద్దతుగా మాట్లాడటంతో.. మోహన్‌రెడ్డికి ఆమె మీద అనుమానం ప్రారంభం అయ్యింది.
ఈ క్రమంలో రాధకు కాశిరెడ్డితో సన్నిహిత సంబంధం ఉందని భావించిన మోహన్‌రెడ్డి.. కాశిరెడ్డి పేరు మీద ఒక సిమ్ తీసుకున్నాడు. అతడి పేరుతోనే తన భార్యతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే కాశిరెడ్డి పేరు మీద చాట్ చేస్తున్న మోహన్‌రెడ్డి.. డబ్బులు ఇస్తాను రమ్మని రాధకు మెసేజ్ చేశాడు. దాంతో నిజంగానే కాశిరెడ్డి తనకు డబ్బులు ఇస్తాడని భావించిన రాధ.. మే 19వ తేదీన ఆమె స్వగ్రామం నుంచి కనిగిరి వచ్చింది. ఆ తర్వాత ఆమెను బలవంతంగా కారులో తమతో పాటు తీసుకెళ్లి.. తీవ్రంగా హింసించి, హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
రాధ హత్య కేసులో మొదటి నుంచి ప్రతి ఒక్కరు కాశిరెడ్డిని అనుమానించారు. ఇక పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగా.. మోహన్‌రెడ్డి ప్రవర్తన తేడాగా అనిపించడంతో.. పోలీసులు అతడిపై నిఘా పెంచారు. ఈ క్రమంలో కనిగిరిలోని పామూరు బస్టాండు సెంటర్‌లో వేచి ఉన్న రాధ వద్దకు వచ్చిన ఎరుపు రంగు కారు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. అంతేకాక భార్య మృతి తర్వాత మోహన్‌రెడ్డి ప్రవర్తనలో మార్పు గమనించిన పోలీసులు.. అతడిపై నిఘా వేసి.. లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కాశిరెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో.. భర్త వేధింపులు పెరిగాయి. ఈ క్రమంలో రాధ తన తల్లిదండ్రులు, బంధువుల వద్ద నుంచి రూ.25 లక్షలు తీసుకెళ్లి భర్తకు ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మొత్తం కోసం భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగాయి. ఈ క్రమంలోనే రాధ హత్య చోటు చేసుకుంది.
ఇక రాధ హత్య తర్వాత.. కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండడంతో తొలుత అందరి అనుమానం అతడి మీదకే వెళ్లింది. రాధ హత్యలో మోహన్ రెడ్డికి సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మోహన్ రెడ్డికి భార్యపై ఎందుకు అంత కోపం, మరీ టార్చర్ చేసి చంపాల్సినంతగా వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. స్నేహితుడికి డబ్బులు ఇచ్చి.. వాటి కోసం భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది రాధ. మరి ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.