మద్యపానం చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. దీనికి బానిసలై ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రులు పాలవుతున్న వారు ఎందరో ఉన్నారు. ఎందరి జీవితాలు ఛిద్రమైనా మద్యపానాన్ని అలవాటు చేసుకునేవారు, దీనికి బానిసలుగా మారే వారి సంఖ్య పెరుగుతోందే గానీ తగ్గడం లేదు. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకుంటున్న వారిలో యువత శాతం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కొందరు యువత ఆల్కహాల్‌కు బానిసలుగా మారి చక్కటి కెరీర్‌ను, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా తేడా కనిపించడం లేదు.
మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయిన ఘటనల గురించి ఈమధ్య వార్తల్లో వింటూనే ఉన్నాం. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొని యువకులు పరస్పరం గొడవ పడటం.. అంతేగాక ఇతరులను ఇబ్బంది పెట్టడం ఈమధ్య కాలంలో ఎక్కువైపోయింది. అలాంటి ఒక ఘటనే ఏపీలోని తిరుపతిలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు రోడ్డుపై నడిచి వెళ్తున్న ఒక మహిళపై ఓ బీర్ బాటిల్ విసిరారు. ఎందుకిలా చేశారని ప్రశ్నించిన ఆమె భర్త పైనా దాడి చేశారు. దీంతో స్థానికులు ఆమెకు సాయంగా వచ్చి యువకులపై ప్రతిదాడికి దిగారు. సురేష్ అనే వ్యక్తి కర్రతో యువకులను తరిమికొట్టాడు. ఈ ఘటనలో యువకుల్లోని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళపై యువకుల అటాక్ గురించి తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
One dead another critically injured after Drunk youth creating ruckus attacked by locals in Tirupati. Brawl started when inebriated men threw a beer bottle at a woman walking on the road near the busy Annamaiya intersection. A murder case has been registered. #AndhraPradesh pic.twitter.com/27gHilQoBW
— Ashish (@KP_Aashish) June 8, 2023