అప్సర హత్య కేసులో రోజుకొక ట్విస్టు చోటు చేసుకుంటుంది. ఇంతకు హత్యకు ముందే అప్సర గర్భం దాల్చిందా? పోస్ట్ మార్టం రిపోర్టులో ఏం తేలిందంటే?
పూజారి సాయికృష్ణ అప్సరను నమ్మించి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇదే ఘటన ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే, సాయికృష్ణకు అప్సర గుడిలో పరిచయమైందని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరు చాలా కాలంగా కాస్త సన్నిహితంగానే మెలిగినట్లు పోలీసులు కూడా తెలిపారు. ఇదిలా ఉంటే, సాయికృష్ణ అప్సరతో అనేకసార్లు శారీరకంగా కలిసినట్లు కూడా వార్తలు వినిపించాయి. గతంలో ఆమెకు గర్భస్రావం కూడా జరిగినట్లు తెలుస్తుంది. అతడు పోలీసుల విచారణలోమాత్రం.. నేను అప్సరతో శారీరకంగా కలవలేదని, ఆమెకు చెన్నైలో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడిని కలవడానికి చాలా సార్లు వెళ్లిందని ఆ తర్వాతే అప్సర గర్భం దాల్చిందని కూడా వివరించినట్లు పోలీసులు తెలిపారు.
కానీ, సాయికృష్ణ పోలీసులకు మొదట్లో మరోలా వివరించాడు. గతంలో నా వల్లే ఆమె గర్భం దాల్చిందని, తెలియకుండా ఉండేందుకు ఆమెను చంపాలనుకున్నాని తెలిపాడు. మరో విషయం ఏంటంటే? అప్సర సాయికృష్ణతో సన్నిహితంగా మెలగడం, ఆ తర్వాత ఆమె సాయికృష్ణను పెళ్లి చేసుకోవాలంటూ టార్చర్ పెట్టిందంట. దీంతో ఆమె ఒత్తిడి భరించలేక నిందితుడు సాయికృష్ణ ప్రియురాలిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇదిలా ఉండగా.. వైద్యులు అప్సర మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం వైద్యులు అందించిన పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం అప్సర గర్భం దాల్చలేదని తేలింది. మొత్తానికి అప్సర పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే సాయికృష్ణ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.