పైన కనిపిస్తున్న దుర్మార్గుడు తన సొంత చెల్లి, బావను హత్య చేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగానే ముందుగా చెల్లెలి భర్తను చంపాలని ప్లాన్ గీసి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సొంత చెల్లిని, బావను ఎందుకు హత్య చేయాలనుకున్నాడో తెలుసా?
ఈ రోజుల్లో కొందరు మనుషులు డబ్బు, ఆస్తులకు ఇస్తున్న ప్రధాన్యత తల్లిదండ్రులకు, కట్టుకున్న వాళ్లకి ఇవ్వడం లేదు. మనుషుల ప్రాణాల కన్న డబ్బే ముఖ్యమనుకుంటూ కన్నవాళ్లను, తోడబుట్టిన వాళ్లను దూరం చేసుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి అడ్డొచ్చిన తోడ బుట్టిన వాళ్లను కూడా కాటికి పంపేందుకు పథకం రచిస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వ్యక్తి.. సొంత చెల్లిని, బావను హత్య చేయాలని అనుకున్నాడు. వీరి హత్యకు పథకం రచించి చివరికి విఫలమయ్యాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం తాటిమాకులపాళ్యంలో బండారు శంకరప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి శివకుమారి అనే చెల్లెలు ఉంది. ఆమెకు గతంలో మదనపల్లె మండలం పప్పిరెడ్డిగారిపెల్లెకు చెందిన జంగాల రామకృష్ణతో వివాహం జరిపించారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి అన్నా, చెల్లెల్లు శంకరప్ప, శివకుమారి మధ్య తల్లిదండ్రులు సంపాదించిన 15 సెంట్ల భూమి విషయమై గొడవలు జరుగుతున్నాయి. శంకరప్ప ఫోర్జరీ సంతకాలతో తన ఆస్తిని ఇతరులకు విక్రయించినట్లుగా చెల్లెలు శివకుమారి అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
కొన్నాళ్ల తర్వాత శంకరప్ప జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక అప్పటి నుంచి శంకరప్ప చెల్లెలు శివకుమారితో పాటు బావపై పగ పెంచుకున్నాడు. ఎప్పటికైనా వారిని చంపాలనే పథకం రచించాడు. ఇందులో భాగంగానే బుధవారం శంకరప్ప తన చెల్లెలు శివకుమారి ఇంటికి వెళ్లాడు. వాళ్లతో సంతోషంగా మాట్లాడుతున్నట్లుగా రాక్షస ప్రేమను ఒలకబోశాడు. అయితే చెల్లెలు భర్త రామకృష్ణ పుంగనూరుకు వెళ్లేందుకు బయలుదేరాడు. అతడిని బస్టాండ్ లో వదిలి పెట్టేందుకు బావమరిది శంకరప్పను రమ్మన్నాడు. బావ చెప్పినట్లే అతని బండిపై బస్టాండ్ వరకు వెళ్లాడు.
ఇక బస్టాండ్ వరకు వెళ్లగానే శంకరప్ప తన వెంట తెచ్చుకున్న కత్తితో బావ రామకృష్ణపై దాడి చేశాడు. చాకచక్యంగా రామకృష్ణ అతడి దాడి నుంచి తప్పించుకున్నాడు. స్థానికులు వెంటనే స్పందించి శంకరప్పను పట్టుకుని రామకృష్ణను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు శంకరప్పను అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవల్లో భాగంగానే శంకరప్ప తన చెల్లెలు, బావను చంపాలనుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల చోటు చేసుకున్న పోలీసులు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. 15 సెంట్ల భూమి విషయమై సొంత చెల్లెలు, బావను హత్య చేయాలనుకున్న శంకరప్ప దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.