అఖిల ట్రిపుల్ ఐటీలో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతుంది. కూతురిని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు.అయితే రోజూ కాలేజీకి వెళ్లిన అఖిల.. సోమవారం వెళ్లకుండా హాస్టల్ గదిలో శవమై కనిపించింది. అసలేం జరిగిందంటే?
నేటి కాలం యువతి యువకులు సమస్యలకు పరిష్కారమే లేదని భావించి చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, చదువులో రాణించలేకపోతున్నాననే కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఏపీలోని అన్నమయ్య జిల్లా వేంపల్లె ప్రాంతం. ఇక్కడే ఉన్న ఆర్జేయుకేటీ ఇడుపులపాయి ట్రిపుల్ ఐటీ కాలేజీలో మంగిర అఖిల (22) అనే యువతి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే తండ్రి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లగా, తల్లి విజయ రాయచోటిలో ఉంటుంది. ఇక కూతురిని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. అఖిల సైతం బాగానే చదువుతూ దూసుకుపోతుంది. అఖిల రోజూ తల్లి విజయకు ఫోన్ చేస్తూ మాట్లాడుతుండేది.
ఇక ఎప్పటలాగే అఖిల సోమవారం ఉదయం కూడా తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. తన హాస్టల్ లోని తన గదిలో ఉన్న తోటి స్నేహితులు కాలేజీకి వెళ్లారు. అయితే కాలేజీకి వెళ్లినట్టే వెళ్లిన అఖిల.. వెనుదిరిగి మళ్లీ హాస్టల్ కు వచ్చింది. అనంతరం తన రూమ్ లోకి చేరుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అఖిల గదిలోని కటికికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక మధ్యాహ్నం తన స్నేహితులు గదికి రావడంతో లోపలి నుంచి గడియ పెట్టినట్లు భావించారు.
ఏం జరిగిందని గదిలోకి తొంగి చూడగా.. అఖిల కిటికికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సీన్ చూసిన తోటి స్నేహితులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియక.. వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. జరిగిందంతా ప్రిన్సిపాల్ కు వివరించారు. దీంతో ప్రిన్సిపాల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అఖిల మృతదేహాన్ని పరిశీలించారు.
ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయాన్ని కాలేజీ సిబ్బంది తల్లి విజయకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి విజయ.. గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? మరేదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.