13 ఏళ్ల బాలికపై కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. ఓ మైనర్ బాలికపై ఏకంగా 80 మంది దుర్మార్గులు అత్యాచారం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
గతేడాది జూన్ నెలలో కరోనాతో ఆ బాలిక తల్లి ఆస్పత్రిలో చేరింది. అదే సమయంలో సవర్ణ కుమారి అనే మహిళ కూడా ఆసుపత్రిలో చేరి బాలిక తల్లితో పరిచయం పెంచుకుంది. ఇక వారిద్దరు అన్ని వివరాలు మాట్లాడుకున్నారు. అయితే మీ చిన్నారిని దత్తత తీసుకుంటానని మాయమాటలు చెప్పింది సువర్ణ. ఇక ఆగస్టులో ఆ చిన్నారి తల్లి కూడా చనిపోవడంతో ఇదే అదునుగా భావించిన సువర్ణ.. తండ్రికి చెప్పకుండానే ఆ బాలికను తీసుకెళ్లిపోయింది.
ఇక తమ కూతురు కనిపించకపోవడంతో తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక కోసం పోలీసులు సైతం గాలిస్తూనే ఉన్నారు. కాగా సువర్ణ మాత్రం ఆ బాలికను వ్యభిచార గృహాలకు పంపిస్తూ దారుణానికి పాల్పడింది. ఆ బాలికను హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కాకినాడ వంటి నగరాల్లోని వ్యభిచార గృహాలకు సువర్ణ పంపినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: భార్యకు పరాయి వ్యక్తి మెసేజ్ పెట్టాడని.. భర్త చేసిన దారుణం!
ఇక పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా ఈ నెల 19న గుంటూరులోని బ్రోతల్ హౌస్ నుంచి చిన్నారిని కాపాడి ప్రధాన నిందితురాలు సవర్ణ కుమారినీ అదుపులోకి తీసుకున్నారు గుంటూరు వెస్ట్ జోన్ పోలీసులు. ఇక నిన్న బీటెక్ విద్యార్థితో సహా మరో 10 మందిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు మాత్రం లండన్ లో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ దారుణమైన ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.