ఈ మధ్యకాలంలో కొందరు పోకిరి వేదవలు అమ్మాయిలకు ఇష్టం లేకున్నా ప్రేమ పేరుతో వారి వెంటపడుతున్నారు. ఇంకొందరైతే ప్రేమకు ఒప్పుకోకపోతే ఏకంగా హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. కానీ ఇక్కడ సీన్ రిపీట్. తమ కూతురి వెంటపడుతున్నాడని ఓ యువకుడిపై తండ్రి ఎవరూ ఊహించని రీతిలో దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అది ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామం.
ఇదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో వేదించాడు. దీంతో ఆ యువతి అతని ప్రేమను నిరాకరించింది. ఇదే విషయం ఆ యువతి తండ్రి అయిన జాన్ కి తెలియడంతో కోపంతో రగిలిపోయాడు. ఇక ఆ యువకుడిని మాట్లాడుదాం రమ్మని గ్రామంలోని ఓ చీకటిలో బందించాడు. వచ్చిన వెంటనే ఆ యువకుడి కాళ్లు చేతులు కట్టేసి మర్మాంగంపై రోకలి బండతో దారుణంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిని ఆ యవకుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: మరిదితో సంబంధం.. బయటపడకుండా సొంత చెల్లినే!
ఈ మేరకు ఆ యువకుడి కుటుంబ సభ్యులు జాన్ పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడు నిజంగానే ప్రేమ పేరుతో వేదించాడా? లేక మరేదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.