అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురని చూడకుండా కిరాతకుడిలా మరాడు. క్షణికావేశంలో కోపంతో ఊగిపోయిన తండ్రి కూతురుని రోకలి బండితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కూతురన్న కనికరం లేకుండా తండ్రి ఇంతటి కిరాతకానికి ఎందుకు పాల్పడ్డాడు? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో స్వాతి(19) అనే యువతి తల్లిండ్రులతో పాటు నివాసం ఉంటుంది. ఇంటర్ పూర్తి చేసిన ఈ యువతి గత కొన్ని రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటుంది. అయితే గత కాలం నుంచి స్వాతి ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు కొన్ని రోజుల నుంచి పీకల్లోతూ ప్రేమలో ఉన్నారు. ఇదే విషయం స్వాతి తండ్రికి తెలిసింది. పద్దతి మార్చుకోవాలంటూ తండ్రి కూతురికి అనేక సార్లు చెప్పి చూశాడు. అయినా కూతురి ప్రవర్తనలో మార్పు రాకపోగా పైగా తండ్రినే ఎదురించే స్థాయికి చేరుకుంది.
ఈ క్రమంలోనే శుక్రవారం తండ్రీ కూతురు మధ్య మరోసారి గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన తండ్రి ఇంట్లో ఉన్న రోకలి బండతో కూతురి తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో కూతురు స్వాతి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం ఇరుగు పొరుగు వాళ్ల నుంచి ఊరంతా పాకింది. చివరికి పోలీసుల వరకు కూడా వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కూతురు కులం తక్కువ వాడిని ప్రేమించిన కారణంగానే తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.