ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న అనేక మంది దంపతులు చిన్న చిన్న గొడవలకే కోపోద్రిక్తులై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం లేదంటే హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. నేటికాలంలో విపరీతంగా నమోదవుతున్న క్రైమ్ కేసులు కూడా ఇవే. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళకు అనుమానం నుంచి బలపడిన వేధింపులు ఎక్కువయ్యాయి. ఇన్నాళ్లు వేచి చూసిన భార్యకు వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. వీటిని భరించలేకపోయిన ఆ ఇల్లాలు కనిపెంచిన పిల్లలను తనతో పాటు అందనంత దూరానికి తీసుకెళ్లిపోయింది.
తాజాగా అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పుట్టపర్తి మండలం బత్తులపల్లి. ఇదే గ్రామానికి చెందిన చరణ్ కుమార్, భాగ్యశ్రీ దంపతులు. గత ఐదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే పిల్లలతో పాటు వారి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ ఉంది. ఇలా ఆనందంగా సాగుతున్న వీరి కాపురంలో భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతోనే భార్యను రోజూ వేధించడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ల పాటు భర్త వేధింపులతో తట్టుకున్న భాగ్యశ్రీ రోజు రోజుకు ఆ వేధింపులు విపరీతంగా మారాయి. ఈ క్రమంలోనే భాగ్యశ్రీ జీవితంపై విరక్తి చెందింది. అందరూ ఉన్నా ఒంటరిగా బతుకున్నా ఈ బుతుకు వద్దునుకుంది. ఇందులో భాగంగానే చనిపోవాలని నిర్ణయం తీసుకుని..
ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నావని అర్థమవుతోంది. ఇలా నా మనసులోని మాటలు నీతో చెప్పాలని చాలా సార్లు లెటర్లు రాశాను. కానీ.. నువ్వు ఫీల్ అవుతావని ఇవ్వలేకపోయాను. ఇప్పటికీ కూడా నేను నోరు విప్పకపోతే తప్పు చేసిన దానిని అవుతాను. ఇది నీకు డైరెక్ట్ గా చెప్పొచ్చు, కానీ.. మనం అంటే ఇష్టం లేదు అని తెలిసి ఎలా వాళ్ల ముందుకు వెళ్లగలం, అందుకే ఇలా రాస్తున్నాను. ఒక్క విషయంలో కూడా నా గురించి పట్టించుకోవు. నేను మనిషిని కానా? నాకు ఫీలింగ్స్ ఉండవా?. ఎంత చెప్పినా వేస్ట్. నువ్వు అర్థం చేసుకోలేవు. నీ మైండ్ అంతా పొల్యూట్ అయ్యింది. కాదు పొల్యూట్ చేశారు. నాకు మా నాన్నని చూడాలని ఉంది. ఒక్కసారి చూపించు ప్లీజ్.. చివరగా ఒక్కటి.. నీకు ఇష్టం లేకపోతే నాకు డైవర్స్ ఇచ్చి నీ మనసులో ఉన్న వాళ్లని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. అంతే కానీ ఇలా నా మీద నిందలు వేయకు. అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా రెడీ కానీ తప్పు మాత్రం చేయను. ఈ లైఫ్ నీతోనే అంతే.. తప్పుగా మాట్లాడి నీ మనసును బాధపెట్టినా నన్ను క్షమించు..
ఇట్లు.. అందరూ ఉన్నా ఒంటరిగా బతుకున్న నేను.. భాగ్యశ్రీ.
అంటూ లేక రాసి ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి ఈ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భాగ్యశ్రీ కన్నీటి కథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.