చూడానికి అమాయకుడిలా కనిపిస్తున్నాడని జాలి చూపించకుండి. అతడు చేసిన పని ఏంటో తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు. అంతకు అతడు చేసిన నేరం ఏంటంటే?
ఇతని పేరు సందీప్. బాగానే చదువుకున్నాడు. ప్రస్తుతం ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు నుంచి ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. ఇక చేతి నిండా డబ్బులు ఉండడంతో అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో వచ్చిన జీతంతో ఫ్రెండ్స్ తో పాటు రోజూ మద్యం తాగేవాడు. ఇక ఇటీవల నెల తిరిగే సరికి చేతిలో చిల్లగవ్వ ఉండకపోవడంతో అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఈ క్రమంలోనే.., సందీప్ ఇంటి పక్కనే ఓ ఒంటరి మహిళ నివసిస్తూ ఉండేది. అయితే, ఇటీవల ఓ రోజు రాత్రి ఆ యువకుడు ఆమె వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో సందీప్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేస్తున్నాడు. ఇతడు గత కొన్ని రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అయితే, చేతినిండా డబ్బులు ఉండడంతో సందీప్ ఫ్రెండ్స్ తో పార్టీలు, సినిమాలు, షికారులు అంటూ తెగతిరిగేవాడు. ఇక రాను రాను అతడు మద్యానికి బానిసై రోజూ మద్యం సేవించేవాడు. ఇదిలా ఉంటే.. మంథ్ ఎండింగ్ కావడంతో అతని చేతిలో చిల్ల గవ్వలేదు.
మద్యం తాగడానికి డబ్బు లేకపోవడంతో అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇకపోతే, ఇతని ఇంటి పక్కనే రమాదేవి అనే ఒంటరి మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఒంటి నిండా బంగారం ధరించేది. దీంతో సందీప్ ఆమె నగలపై కన్నేశాడు. ఎలాగైన ఆమె నగలను దొంగిలించాలని అనుకునేవాడు. ఈ నెల 14న మేడపై రమాదేవి ఒంటరిగా నిద్రించింది. ఈ విషయం తెలుసుకున్న సందీప్ పక్కా ప్లాన్ తో ఆమె వద్దకు వెళ్లాడు. రామాదేవి జోరునిద్రలోకి వెళ్లడంతో ఆమె దిండుకింద ఉన్న ఇంటి తాళం చెవి తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఇంటి తాళం తీసి బీరువాలో దాచుకున్న 7 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లి ఎప్పటిలాగే తాళం చెవి ఆమె దిండు కింద పెట్టి వెళ్లిపోయాడు.
ఇక మరుసటి రోజు బీరువాలో బంగారం కనిపించకుండాపోయింది. చుట్టు పక్క వాళ్లకు సమాచారం అందించింది. ఇక చేసేదేం లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. అనుమానితుల వేలు ముద్రలు తీసుకున్నారు. కానీ, ఎవరిది సరిపోలలేదు. చివరికి సందీప్ వేలు ముద్రలు తీసుకునేందుకు పోలీసులు అతడిని పిలవడంతో ఏవేమో మాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఎందుకో అనుమానం వచ్చిన పోలీసులు.. అతడిని రప్పించి వెలు ముద్రలు తీసుకోక అతడివి మ్యాచ్ అయ్యాయి. పోలీసులు స్టేషన్ కు పిలిపించి గట్టిగా విచారించగా సందీప్ తన నేరాన్ని అంగీకరించాడు. తాగుడుకు డబ్బులు లేని కారణంగా ఇలా చేశానని వివరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.