అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమారులతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరి పిల్లలతో సహా చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు తండ్రి పిల్లలతో పాటు కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి?
అది ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో రఫీ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నేళ్ల తర్వాత ఈ భార్యాభర్తలకు సోహైల్ (9), ఇమ్రాన్ (6) అనే ఇద్దరు కుమారులు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే.. ఇటీవల రఫీ తన ఇద్దరు పిల్లలతో సహా స్థానికంగా ఉన్న ఓ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక మరుసటి రోజు చెరువులో మృతదేహాలు నీటిపై తేలాయి. ఈ సీన్ చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్యపై అనుమానంతోనే భర్త రఫీ పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అసలు నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. రఫీ ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు కుమారులతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.