వివాహేతర సంబంధాలే నిండు కాపురాల్లో నిప్పును రాజేస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఎవరికి వారు యుమునా తీరే అన్నట్లుగా అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ క్షణిక సుఖం కోసం అడ్డదారుల తొక్కుతున్నారు. ఇలా భార్యాపిల్లలను కాదని ఓ భర్త అక్రమ సంబంధాల్లో పాలు పంచుకుని జీవితం నాశనం చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది అనంతపురం జిల్లాలోని పెద్దవడగూరు మండలం క్రిష్టిపాడు.
ఇదే గ్రామంలో రామంజనేయులు, కవిత అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. ఇక భర్త స్థానికంగా ఓ షాపులో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే కొంత కాలం తర్వాత ఈ దంపతులు తాడిపత్రి నగరానికి మకాం మర్చారు. అప్పటి వరకూ వీరి కాపురం పిల్లలతో సంతోషంగానే సాగింది. కానీ రోజులు మారే కొద్ది భర్త రామాంజనేయులు బుద్ది వక్రమార్గంలోకి వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: తాగిన మత్తులో అత్తపై అల్లుడి దారుణం.. ఇంట్లో అందరూ చూస్తుండగా!
స్థానికంగా ఉండే ఓ మహిళతో రామాంజనేయులు వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత భర్త సాగిస్తున్న ఈ చీకటి వ్యవహారం భార్యకు తెలిసింది. ఇదే విషయమై ఆ దంపతులు మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. అయితే ఈ క్రమంలో సోమవారం కూడా మరోసారి ఈ భార్యాభర్తల మధ్య వివాదం నడిచింది. ఇక భర్త తీరుతో విసుగు చెందిన భార్య కవిత పిల్లలతో పాటు చనిపోవాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే కవిత మంగళవారం పుట్టింటికి వెళ్తున్నానని భర్తకు చెప్పి ఇద్దరు పిల్లలతో పాటు స్థానికంగా ఉండే రంగరాయల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా మరుసటి రోజు వారి ముగ్గురు మృతదేహాలు చెరువులో తేలియాడడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.