అమ్మా.. మా ఆయన బాగా టార్చర్ పెడుతున్నారు. కనీసం రోజూ నిద్రకూడా పోకుండా నరకం చూపిస్తున్నారు. ఇక నా వల్ల కావడం లేదు. నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది అమ్మా.. అంటూ తన తల్లితో ఫోన్ లో మాట్లాడిన కూతురు మాటలకు విన్న కొద్ది గంటలకు ఆ మహిళ మాటలే నిజమయ్యాయి. తాజాగా విశాఖలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తరువూర్ జిల్లా విలమల్ గ్రామానికి చెందిన అను(27)ని వారి బంధువైన ఎం.ప్రవీణ్‌కి ఇచ్చి 2021లో పెళ్లి చేశారు.
అయితె పెళ్లైన కొంత కాలం పాటు వీరి కాపురం బాగానే సాగింది. కాగా ఉద్యోగ నిమిత్తం ఈ దంపతులు ఏపీలోని అనకాపల్లి పరిధిలోని అచ్యాతాపురంలో నివాసం ఉంటున్నారు. ఇక కొత్త కాపురం బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలోనే భర్త అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలు పెట్టారు. దీంతో భరించలేకపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక కొన్నాళ్ల తర్వాత భర్త అత్తింటికి వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి భార్యను మళ్లీ తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఇక నుంచైన భర్త మంచిగా ఉంటాడనే భార్య ఆశ పడింది. కానీ ప్రవీణ్ మళ్లీ కథను మొదటికే తీసుకొచ్చాడు.
అదనపు కట్నం తేవాల్సిందేనంటూ రోజూ వేధించడం మొదలు పెట్టారు. ఆమె ఆడపడుచు కూడా భర్తకు వత్తాసు పలికింది. తీవ్ర మనస్థాపానికి గురైన అను తన తల్లికి ఫోన్ చేసి అమ్మా.. మా ఆయన బాగా టార్చర్ పెడుతున్నారు. కనీసం రోజూ నిద్రకూడా పోకుండా నరకం చూపిస్తున్నాడు. నా వల్ల కావడం లేదు. నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది అమ్మా.. అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక ఇలా తల్లితో మాట్లాడి రెండు మూడు గంటలు గడిచిందో లేదో అప్పటికే అను ఫ్యానుకు వేలాడుతూ సూసైడ్ చేసుకుందని అత్తింటి వాళ్లకు భర్త ప్రవీణ్ ఫోన్ చేసి చెప్పాడు. అను మరణ వార్త తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని విగత జీవిగా పడిఉన్న కూతురుని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే భర్తే మా కూతురిని హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అను తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.