దేశ వ్యాప్తంగా బాలికలపై రోజుకో చోట అత్యాచార దాడులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఏపీలోని ఓ ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లాలోని ఇద్దరు అక్కా చెల్లెల్లు అర్ధరాత్రి 2 గంటలకు వాష్ రూమ్ కోసమని బయటకు వెళ్లారు. అయితే వీరి ఇంటి పక్కనే సాయి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.
వీరు బయటకు వెళ్లడం చూసిన ఆ యువకుడు వారి వెంటే వెళ్లాడు. ఇక అక్కతో పాటు వెళ్లిన ఆరేళ్ల చెల్లిని ఆ దుర్మార్గుడు చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో అక్కడ చెల్లి కనిపించకపోయే సరికి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు అటు ఇటు అంతా వెతకగా చెట్ల పొదల్లో తీవ్ర రక్త స్రవంతో అసస్మారక స్థితిలో పడి ఉంది. ఇది గమనించిన ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Bihar: అందంగా ఉందని అత్తపై కన్నేసిన అల్లుడు.. కూతురు లేని టైమ్ చూసి!
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.