పవిత్రమైన వివాహ బంధానికి కొందరు మహిళలు తూట్లు పొడుస్తున్నారు. భర్తను కాదని పరాయి సుఖం పాకులాడుతూ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా నేటికి ఎంతో మంది మహిళలు వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను కాదని మరో వ్యక్తితో కునుకులాడింది. ఇక భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త అవమాన భారంతో తట్టుకోలేకపోయాడు. ఇక ఏం చేయాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని కొత్తవీధికి చెందిన కామిరెడ్డి దుర్గాప్రసాద్ ఓ మహిళను కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ రోజులు మారే కొద్ది భార్య తన బుద్దిని వక్రమార్గంలోకి మళ్లించింది. ఏకంగా మొగుడుని కాదని పరాయి వ్యక్తిపై మనసు పడి క్షణిక సుఖం పరుగులు తీసింది. దీంతో భర్తకు తెలియకుండా ఎంచక్కా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ చీకటి సంసారాన్ని నడిపించింది. ఇక కొన్ని రోజుల తర్వాత భార్య సాగిస్తున్న చీకటి కాపురం భర్తకు తెలిసింది.
ఈ క్రమంలోనే భార్య ప్రియుడితో కలిసి లేచిపోయింది. దీనిని తట్టుకోలేని భర్త తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఫోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు,.. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఎటూ తేల్చుకోలేని ఈ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగానే తాను బలవన్మరణానికి పాల్పడే ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తన గోసను వెల్లబోసుకున్నాడు.
నా భార్య తనను కాదని వివాహేతర సంబంధాన్ని నడిపించి ప్రియుడితో కలిసి నన్ను మోసం చేసింది. ఇలా చేయొద్దని ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా.. నా మాటను అస్సలు లెక్కచేయలేదని వాపోయాడు. ఇక నా ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భర్త దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు తీసుకున్న భర్త తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.