జార్ఖండ్ నటిగా గుర్తుంపు తెచ్చుకున్న రియా కుమారి భర్తతో పాటు కారులో ఉండగా బుధవారం కొందరు గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలోనే నటి రియా కుమారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ ఘటన అనంతరం రియా కుమారి భర్త ప్రకాష్ కుమార్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. భర్త ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. నటి రియా కుమారి వద్ద ఉన్న విలువైన వస్తువులు దొంగిలించేందుకే నటి రియా కుమారిని తుపాకీతో కాల్చి చంపారని తెలిపారు. కానీ అనంతరం పోలీసులు మరిన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. ఇక అనూహ్యంగా పోలీసులు తాజాగా రియా కుమారి భర్త ప్రకాష్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కొద్దిసేపట్లో అతనిని కోర్టులో ప్రవేశపెట్టనున్నామని పోలీసులు తెలిపినట్లుగా తెలుస్తుంది.
అసలు నటి రియా కుమారి భర్తను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పథకం ప్రకారమే భర్త ప్రకాష్ భార్యను హత్య చేయించాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఈ కేసులో ముందు ముందు ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారిపోయింది. జార్ఖండ్ కు చెందిన నటి రియా కుమారి, ఆమె భర్త ప్రకాష్ కుమార్ ఇటీవల పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నారు. బుధవారం రాజ్ పూర్ లోని మహశ్రేఖ వంతెన వద్ద కారులో కూతురితో పాటు దంపతులు ఉండగా కొందరు గుర్తు తెలియని దుండుగులు నటి రియా కుమారిపై తుపాకీతో కాల్పులు జరిపారు.