65 ఏళ్ల వృద్ధుడి కిరాతకం.. కనికరం లేకుండా బాలికపై..!

  • Written By:
  • Publish Date - September 7, 2021 / 12:14 PM IST

సమాజంలో జరుగుతున్న దాడులను చూస్తేంటే పరిస్థితులు ఎక్కడికి వెళ్తున్నాయో తలుచుకుంటేనే భయంగా ఉంది. వయసుతో తేడా లేకండా బాలికలపై కొందరు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని మూసాపేటలో 8 ఏళ్ల బాలిక ఓ కాలనీలో తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటుంది. అయితే స్థానికంగా ఉండే ఓ 65 ఏళ్ల వృద్ధుడు ఆ బాలికపై ఎప్పటి నుంచో కన్నేశాడు.

దీంతో అతడు ఆ బాలికపై ఎలాగైన కామకోరికలు తీర్చుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లే దాడికి దిగాలని భావించి సమయం చూసి కామంతో కాటేశాడీ దుర్మార్గుడు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి ఆ వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఈ విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పటంతో వెలుగులోకి వచ్చింది.

వెంటనే స్పందించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడినిపై విచారణ చేపట్టారు. ఇక ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ఈ 65 ఏళ్ల కామాంధుడు వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV