పరుగులు తీస్తున్న కంప్యూటర్ యుగంలో కూడా మూడ నమ్మకాలతో ఇప్పటికీ చాలా మంది మోసపోతున్నారు. మరణించిన వ్యక్తిని తిరిగి బతికిస్తామని కొందరు మంత్రగాళ్లు ఎంతో మంది అమాయక ప్రజలను నట్టెట్ట ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ లోని కోఠీబార్ పరిధిలోని పభ్యా గ్రామంలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ గ్రామంలో ఛోట్ కన్ అనే వ్యక్తికి 15 ఏళ్ల కూతురు ఉంది. ఇటీవల ఆ బాలిక పాము కాటుకు గురైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ హాస్పటల్ కు వెళ్లే లోపే ఆ బాలిక చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల కన్నీటి రోదనల మధ్య ఎట్టకేలకు ఆ బాలికను దహన సంస్కారాలు పూర్తి చేశారు. చితికి నిప్పు కూడా అంటించారు. ఇక ఇంతలోనే ఓ భూత వైద్యుడు చనిపోయిన ఆ బాలికను బతికిస్తానని ఆ కుటుంబ సభ్యులను నమ్మబలికాడు.
నిజమేనని భావించిన తల్లిదండ్రులు చితి మంటల్లో కాలిపోతున్న ఆ బాలిక శవాన్ని బయటకు తీశారు. ఇక ఆ మంత్రగాడు 24 గంటల పాటు ఎన్నో పూజలు చేశాడు. దీంతో తల్లిదండ్రులు తమ కూతురు నిజంగానే బతుకుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఎన్ని పూజలు చేసిన ఆ బాలిక మాత్రం బతకలేదు. దీంతో మూడ నమ్మకాలతో మోసపోయామని భావించి తిరిగి మళ్లీ దహన సంస్కారాలు చేశారు. ఇలా ఇప్పటికీ ఎంతోమంది మూడ నమ్మకాలతో నిండ మోసపోతున్నారు. దీంతో ఎంతోమందిని మోసం చేస్తున్న భూతవైద్యుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.