మత్తెక్కించే మాటల్తో అతడ్ని నిండా ముంచింది. అతడి వద్దనుంచి ఏకంగా 34 లక్షల రూపాయలు దోచేసింది. ఆమె చేసిన మోసానికి అతడు షాక్ అయ్యాడు. ఆమె ఎవరు? ఎందుకు ఆమె అతడి మోసం చేసింది?
పెళ్లి కాని ప్రసాదులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. చనిపోయేలోగా ఒక్కసారైనా పెళ్లి చేసుకోవాలన్న ఆశతో బతుకుతూ ఉంటారు. తెలిసిన వాళ్లను, తెలియని వాళ్లను.. మాట్రిమొనియల్ సైట్లను ఇలా అన్నీ చోట్లా పిల్ల కోసం వెతుకుతూ ఉంటారు. ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు మహిళలు పెళ్లి కాని ప్రసాదులకు వల విసిరి, వారినుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలిసి మగాళ్లు లబోదిబోమంటున్నారు. తాజాగా, తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కిలేడీ బారిన పడి నిండా మోసపోయాడు. దాదాపు 34 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని పాండిచ్చేరికి చెందిన బాలాజీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యతో గొడవల కారణంగా ఇతడు వేరుగా ఉంటున్నాడు. ఇతడికి కొన్ని నెలల క్రితం సోమశ్రీ నాయక్ అనే యువతితో పరిచయం అయింది. తనది అమెరికా అని.. సిరియాలో డాక్టర్‌గా పని చేస్తున్నా అని ఆమె చెప్పింది. ప్రతి రోజూ వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. సోమశ్రీ మాటలతో బాలాజీ మైమరిచిపోయాడు. ఆమె తన ప్రాణం అనుకున్నాడు. ఓ రోజు ఆమెకు తన మనసులోని మాట చెప్పాడు. ఆమె ఓకే అంది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు.
బాలాజీ పూర్తిగా తన మాయలో పడిపోయాడని నిర్థారించుకున్న సోమశ్రీ తన ప్లాన్‌ను అమల్లో పెట్టింది. ఏవేవో కారణాలు చెబుతూ అతడి దగ్గరినుంచి డబ్బులు తీసుకోసాగింది. కాబోయే భార్యే కదా అనుకున్న బాలాజీ ఆమె అడిగినంత ఇస్తూ వచ్చాడు. అలా మొత్తం 34 లక్షల రూపాయలు ఆమెకు ఇచ్చాడు. డబ్బుల విషయంలో ఎంతో ఆసక్తిగా ఉండే ఆమె.. పెళ్లి గురించి మాట్లాడితే సరిగా స్పందించేది కాదు. ఓ రోజు పెళ్లి గురించి బాలాజీ ఆమెను గట్టిగా నిలదీశాడు. దీంతో సోమశ్రీ బాలాజీతో మాట్లాడటం మానేసింది. రోజులు గడస్తున్నా ఆమెనుంచి స్పందన రాకపోవటం.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో.. తాను మోసపోయానని బాలాజీ గ్రహించాడు. పోలీసులకు దీనిపై పిర్యాదు చేశాడు. బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిలాడీ లేడి అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.