ప్రస్తుతం సమాజంలో ఎన్నో ఘోరాలను చూస్తున్నాం. ఆస్తులు కోసం పిల్లల్ని పెద్దలు చంపడం, ఆస్తి ఇవ్వరనే భయంతో తల్లిదండ్రులను కడుపున పుట్టిన వాళ్లు కడతేర్చడం చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది అన్నింటికంటే ఎంతో దారుణమై, భయంకరమైన ఘటన. తల్లి విషయంలో ఈ కూతురు చేసిన పని చూస్తే అంతా నోరెళ్లబెట్టాల్సిందే. అసలు ఇలాంటి కూతుళ్లు కూడా ఉంటారా అని ప్రశ్నించక మానరు. ఓ కూతురు తన కన్న తల్లి శవాన్ని రెండేళ్లుగా ఫ్రిడ్జ్ లో దాచి పెట్టింది. ఆమె అంత ఘోరానికి ఎందుకు పాల్పడింది? అసలు ఏం జరిగిందో చూద్దాం.
ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. చికాగోలోని ఇల్లినాయిస్ లో ఓ కూతురు చేసిన నిర్వాకం ఇది. ఎవా బ్రోచర్ అనే మహిళకు 96 ఏళ్ల మిచాల్స్కీ అనే తల్లి ఉండేది. ఆమె గత రెండేళ్లుగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఎవా బ్రోచర్ ఇంటి సెల్లార్ లో ఓ ఫ్రిడ్జ్ ని గుర్తించారు. అందులో మిచాల్స్కీ శవాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆమె శవం రెండేళ్లుగా ఆ ఫ్రిండ్జ్ లోనే ఉందంట. ఆ విషయం తెలియగానే ఎవా బ్రోచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అయతే దర్యాప్తులో పోలీసులకు కొన్ని విషయాలు తెలిశాయి. ఆమె తల్లి పేరుతో ఒక ఫేక్ ఐడీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. బ్రోచర్ తల్లి చనిపోవడానికి రెండేళ్ల ముందే ఆమె ఫ్రిడ్జ్ ని కొనుగోలు చేసినట్లు రసీదులు దరికాయి. అంటే తల్లిని ఆమె కావాలని హత్య చేసిందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరొకటి ఆమె తల్లి మరణాన్ని దాచిపెడితే ఆమెకు వచ్చే లాభం ఏంటి అనేది కూడా వారికి అంతుపట్టడం లేదు. మరోవైపు మిచాల్స్కీ మృతిపై మనవరాలు భావోద్వేగానికి లోనైంది. తన తల్లి బ్రాచర్ ఎవరి పట్ల ప్రేమ చూపదని.. ఆఖరికి తనని కూడా పట్టించుకోదని ఆరోపించింది. బ్రోచర్ చేసిన పని తెలుసుకుని స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాంటి కూతుళ్లు కూడా ఉంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.